కరోనా కష్టాల్లో 49% మంది
close

Published : 15/05/2021 05:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా కష్టాల్లో 49% మంది

దాచుకున్న డబ్బు ఖర్చుపెట్టింది 31%: వే2న్యూస్‌ సర్వే

హైదరాబాద్‌: కరోనా కారణంగా ప్రతి ఒక్కరికీ ఏదో ఒక రూపంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉద్యోగాలు పోవడం, ఆదాయం తగ్గడం, ఆసుపత్రి ఖర్చుల రూపంలో అధిక భారం పడడం, ఇతరత్రా ఆర్థిక బాధలు, ఆత్మీయులను కోల్పోవడం, కుటుంబ బంధాలు దెబ్బతినడం.. ఇలా 15 నెలలుగా ప్రతి ఒక్కరిపైనా కరోనా ప్రతికూల ప్రభావం చూపిస్తూనే ఉంది. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో ప్రభుత్వాలు తీసుకునే వ్యూహాత్మక నిర్ణయాలు, నియంత్రణ చర్యలే ఈ సమస్యకు ఔషధంలా పనిచేస్తాయని వే2న్యూస్‌ సీఈఓ రాజు వనపాల పేర్కొన్నారు. కొవిడ్‌ నేపథ్యంలో ఈ సంస్థ దాదాపు 3 లక్షల మంది నుంచి సేకరించిన అభిప్రాయాలతో నివేదిక రూపొందించింది. ఈ ప్రకారం..  
* కరోనా మలివిడతలో దాదాపు 49 శాతం మంది కష్టాలతో సహవాసం చేస్తున్నారు. ఆసుపత్రి ఖర్చులు పెరిగాయని 28% మంది చెప్పగా.. ఉద్యోగాలు కోల్పోవడంతో ఆర్థిక బాధలు మరింత ఎక్కువయ్యాయని 24% మంది వెల్లడించారు.
* సంక్షోభం నుంచి బయటపడేందుకు 32 శాతం మంది అనవసర ఖర్చులు తగ్గించుకుంటున్నారట. ఇక 31.6 శాతం మంది అత్యవసరాల కోసం దాచుకున్న డబ్బులను ఇప్పటికే ఖర్చుపెట్టారు.
* ఆర్థిక అవసరాల కోసం కేవలం 4.9 శాతం మంది మాత్రమే క్రెడిట్‌ కార్డులు వినియోగిస్తున్నారు. అనధికారిక అప్పులు, వ్యక్తిగత, పసిడి రుణాలు తీసుకుంటున్నవారు 24 శాతం వరకు ఉన్నారు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని