రూ.6,000 కోట్ల సమీకరణలో జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా!
close

Published : 24/10/2021 02:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రూ.6,000 కోట్ల సమీకరణలో జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా!

ఈనాడు, హైదరాబాద్‌: జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ నిధుల సమీకరణ యత్నాల్లో నిమగ్నమైంది. అర్హత కలిగిన సంస్థాగత మదుపరుల (క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ప్లేస్‌మెంట్‌) నుంచి రూ.6,000 కోట్లు సేకరించనున్నట్లు తెలుస్తోంది. నెల రోజుల వ్యవధిలో ఈ ప్రక్రియ పూర్తి కావచ్చనేది మార్కెట్‌ వర్గాల అభిప్రాయంగా ఉంది. దీని ప్రకారం సంస్థాగత మదుపరులకు జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కొత్తగా షేర్లు జారీ చేస్తుంది. తద్వారా లభించిన సొమ్మును కొంతమేరకు అప్పు తీర్చడానికి కేటాయించే అవకాశం ఉంది. రుణభారాన్ని తగ్గించుకునే యత్నాల్లో నిమగ్నమైనట్లు ఇటీవల సంస్థ యాజమాన్యం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ త్వరలో రెండు కంపెనీలుగా విడిపోనుంది. దీని ప్రకారం విమానాశ్రయాల నిర్వహణ వ్యాపారం జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కింద కొనసాగుతుంది. విద్యుత్తు, అర్బన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రాజెక్టులతో జీపీయూఐఎల్‌ (జీఎంఆర్‌ పవర్‌ అండ్‌ అర్బన్‌ ఇన్‌ఫ్రా) అనే కొత్త కంపెనీ ఏర్పాటవుతుంది. ఈ విభజన ప్రక్రియ ఈ ఆర్థిక సంవత్సరాంతంలోగా పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే నిధుల సేకరణకు సిద్ధపడటం ఎంతో ప్రాధాన్యమున్న అంశంగా మారింది.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని