త్వరలో బెంగళూరులో మెట్రోసేవలు పునఃప్రారంభం..! - Bengaluru to resume Metro services soon
close
Published : 27/08/2020 23:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

త్వరలో బెంగళూరులో మెట్రోసేవలు పునఃప్రారంభం..!

బెంగళూరు: బెంగళూరులో త్వరలోనే మెట్రో రైళ్ల సేవలను పునః ప్రారంభిస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి బి.ఎస్‌ యడియూరప్ప స్పష్టంచేశారు. రాష్ట్రంలో కరోనా ప్రభావం ఉన్నప్పటికీ సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు పలు చర్యలు చేపడుతున్నామని ఆయన అన్నారు. దీనిలో భాగంగా త్వరలోనే మెట్రో సేవలను పునరుద్ధరిస్తామని.. వీటికి అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటామని ముఖ్యమంత్రి వెల్లడించారు. నగరంలో ఓ ఫ్లైఓవర్‌కు పేరును ఖరారు చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి యడియూరప్ప విలేకరులతో మాట్లాడారు. కరోనా కారణంగా గత ఐదు నెలలుగా నిలిచిపోయిన మెట్రో సేవలను తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం నుంచి అనుమతులు రావాల్సి ఉంది. సెప్టెంబర్‌ 1 నుంచి మొదలయ్యే అన్‌లాక్‌ 4.0లో కేంద్రప్రభుత్వం సూచించే మార్గదర్శకాల కోసం వేచిచూస్తున్నట్లు మెట్రో అధికారులు వెల్లడించారు. ఇప్పటికే వీటికి సంబంధించిన ప్రామాణిక నియంత్రణ పద్ధతులను సిద్ధం చేశామని మెట్రో అధికారులు పేర్కొన్నారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని