ఆయనతో నన్నూ దహనం చేయండి - New bride tries for suicide video emerges
close
Updated : 15/09/2020 13:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆయనతో నన్నూ దహనం చేయండి

ఇండోర్‌: భర్త మరణాన్ని తట్టుకోలేక ఓ నవ వధువు షాపింగ్‌మాల్‌లో పైనుంచి దూకి ఆత్మహత్యకు యత్నించింది. ఈ  హృదయ విదారక ఘటన మధ్యప్రదేశ్‌లోని విజయ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పెళ్లయిన 15 రోజులకే రోడ్డు ప్రమాదం భర్తను బలి తీసుకోగా.. ఆమె ప్రస్తుతం మృత్యువుతో పోరాడుతోంది.

ఇండోర్‌కు చెందిన ఎంబీబీఎస్‌ విద్యార్థిని సానియా సుమన్‌ (28), ఉజ్జయినికి చెందిన శుభం ఖండేల్వాల్‌ అనే యువకుడిని 15 రోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. ఈ దంపతులు ఇండోర్‌లో కాపురం పెట్టారు. అయితే బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భర్త మృతి చెందారు. దీనితో సానియాను తమతో పాటు తీసుకు వెళ్లేందుకు వచ్చిన తల్లితండ్రులు విమానాశ్రయంలో వేచి ఉన్నారు. అయితే విమానాశ్రయానికి వెళ్లాల్సిన ఆమె.. ఇంతలోనే తీవ్ర నిర్ణయానికి వచ్చింది. ఓ షాపింగ్‌మాల్‌లో మూడో అంతస్తు పైనుంచి దూకింది. తీవ్ర గాయాల పాలైన ఆమెను సెక్యూరిటీ గార్డులు, సిబ్బంది చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

కాగా, భర్తతో కలిపి తనకు దహన సంస్కారాలు చేయాలని వైద్యురాలు రాసిన సూసైడ్‌‌ నోట్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సబ్ ఇన్‌స్పెక్టర్‌ ఆర్ కుమ్రావత్ తెలిపారు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. యువతి షాపింగ్‌ మాల్‌లో పైనుంచి దూకిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని