close

తాజా వార్తలు

Published : 15/08/2020 01:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అమ్మపేరుతో చెట్టు నాటిన అమితాబ్‌

ముంబయి: వృద్ధాప్యం వచ్చినా బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌గా కొనసాగడమే కాదు.. కరోనా మహమ్మారిని సైతం జయించిన నటుడు అమితాబ్‌ బచ్చన్‌. ఇటీవల కరోనా సోకడంతో ముంబయిలోని నానావతి ఆస్పత్రిలో చికిత్స పొంది తిరిగి ఇంటికొచ్చిన బిగ్‌బీ తొలిసారిగా బయటకొచ్చి ఓ పనిచేశారు. ఇంటి ఆవరణలో కొన్ని దశాబ్దాల కిందట నాటిన చెట్టు ఇటీవల నేలకొరడంతో ఆ ప్రాంతంలో మరో చెట్టును నాటారు. పడిపోయిన చెట్టు.. కొత్తగా నాటిన చెట్టుతో ఫొటో దిగి సోషల్‌ మీడియాలో పెట్టారు. 

‘‘ఈ భారీ ‘గుల్‌మోహర్‌’ చెట్టును 1976లో నా ఇల్లు ‘ప్రతీక్ష’లో స్వయంగా నేనే నాటాను. కానీ ఇటీవల ముంబయిలో భారీ వర్షాలకు ఈ చెట్టు నేలకొరిగింది. ఆగస్టు 12న మా అమ్మగారి పుట్టిన రోజు పురస్కరించుకొని చెట్టు పడిపోయిన స్థానంలోనే మా అమ్మ(తేజి బచ్చన్‌)పేరుతో మరో కొత్త ‘గుల్‌మోహర్‌’ చెట్టును నాటాను’’అని అమితాబ్‌ సోషల్‌మీడియాలో రాసుకొచ్చారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.