మాన్సాస్‌ వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదు: వెల్లంపల్లి - ap minister vellampalli on mansas trust issue
close
Published : 15/06/2021 14:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మాన్సాస్‌ వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదు: వెల్లంపల్లి

విజయవాడ: మాన్సాస్‌ ట్రస్టు విషయంలో హైకోర్టు తీర్పు పూర్తిగా వచ్చాకే స్పందిస్తామని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు.పదవులు ముఖ్యం కాదని.. అభివృద్ధి చూడాలని చెప్పారు. మాన్సాస్‌ ట్రస్టు ఛైర్మన్‌గా సంచైత గజపతిరాజును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది జారీ చేసిన జీవోను హైకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో విజయవాడలో మంత్రి మీడియాతో మాట్లాడారు. మాన్సాస్‌ ట్రస్టు వ్యవహారాల్లో ప్రభుత్వం ఎక్కడా జోక్యం చేసుకోలేదని వెల్లంపల్లి చెప్పారు. అన్యాక్రాంతమైన ట్రస్టు, దేవాలయ భూములను గుర్తిస్తున్నామన్నారు.  

మాన్సాస్‌ ట్రస్టు ఛైర్మన్‌గా సంచైత నియామకం చెల్లదని హైకోర్టు సోమవారం స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన జీవోను రద్దు చేసింది. ట్రస్టు వ్యవస్థాపక కుటుంబ సభ్యులుగా సంచైత గజపతిరాజు, ఊర్మిళ గజపతిరాజు, ఆర్‌వీ సునీత ప్రసాద్‌లను గుర్తిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలతో పాటు మొత్తం నాలుగు జీవోలను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ట్రస్టు పూర్వ ఛైర్మన్‌ అశోక్‌గజపతిరాజును మాన్సాస్‌ ట్రస్టు ఛైర్మన్‌గా, సింహాచలం దేవస్థానం వంశపారంపర్య ట్రస్టీ/ ఛైర్మన్‌గా పునరుద్ధరించింది. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని