బాలయ్య సెట్లో చాలా సరదాగా ఉంటారు! - balakrishna have a lot of fun on set pagya jaiswal
close
Published : 15/05/2021 01:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

 బాలయ్య సెట్లో చాలా సరదాగా ఉంటారు!

ఇంటర్నెట్ డెస్క్: బాలకృష్ణ సెట్‌లోకి అడుగు పెట్టగానే అందరితోనూ సరదాగా ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోయానని అంటోంది కథానాయిక ప్రగ్యా జైస్వాల్‌. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘అఖండ’. ఇందులో ప్రగ్యా ఐఏఎస్ అధికారిగా కనిపించనుందని సమాచారం. తాజా ఈ సినిమా గురించి మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించింది.

‘‘బాలకృష్ణ సరసన కథానాయికగా నటించాలనే సరికి కొంచెం భయమేసింది. ఎందుకంటే ఆయనకు చాలా కోపం ఎక్కువ. సెట్లో ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పడంతో కొంత భయపడ్డాను. కానీ, బాలకృష్ణ సెట్లోకి అడుగుపెట్టగానే అందరితో సరదాగా ఉండటం చూసి ఆశ్చర్యపోయా. ఇక భయం లేదనిపించింది. తిరిగి సినిమా షూటింగ్‌ షెడ్యూల్‌ ఎప్పుడు ప్రారంభమవుతుందా అని ఎదురుచూస్తున్నానని’’ తెలిపింది.

ద్వారకా క్రియేషన్‌ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి ‘అఖండ’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకాంత్‌, పూర్ణలు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ సంగీత స్వరాలు సమకూరుస్తుండగా సి.రాంప్రసాద్‌ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. మాటలు: ఎం.రత్నం, స్టంట్‌మాస్టర్లుగా రామ్‌ - లక్ష్మణ్ పనిచేస్తున్నారు. ప్రగ్యా జైస్వాల్‌ - వరుణ్‌ తేజ్‌తో కలిసి ‘కంచె’ నటించి ప్రేక్షకుల్ని అలరించింది. 


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని