ఇది గొప్ప చిత్రమని నమ్మాం - రాజేంద్ర ప్రసాద్‌ - gaalisampath success meet
close
Published : 13/03/2021 11:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇది గొప్ప చిత్రమని నమ్మాం - రాజేంద్ర ప్రసాద్‌

హైదరాబాద్‌: శ్రీవిష్ణు, లవ్‌లీ సింగ్‌ జంటగా అనీష్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గాలి సంపత్‌’. రాజేంద్ర ప్రసాద్‌ టైటిల్‌ పాత్రలో నటించారు. ఎస్‌.క్రిష్ణ నిర్మాత. ఈ సినిమాకి అనిల్‌ రావిపూడి స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు సమర్పకులుగా వ్యవహరించారు. ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే   హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్‌ మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రం ఒక తండ్రీ కొడుకుల కథతో రూపొందింది. శ్రీవిష్ణు, నేను చేస్తున్నప్పుడే కచ్చితంగా గొప్ప సినిమా అవుతుందని నమ్మాం. ఇప్పుడు ప్రేక్షకుల నుంచి ఇంత చక్కటి ఆదరణ దక్కుతున్నందుకు ఆనందంగా ఉంది. ఒక మంచి సినిమా చూశామనే ఆనందం ప్రేక్షకులకు, ఇంత మంచి చిత్రం చేశామనే సంతృప్తి మాకు మిగిల్చినందుకు భగవంతుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నాకింత మంచి పాత్ర ఇచ్చినందుకు మా అబ్బాయి అనిల్‌ రావిపూడికి, అనీష్‌ కృష్ణకి నా ధన్యవాదాలు’’ అన్నారు.   ‘‘థియేటర్లలో ప్రేక్షకుల నవ్వులు చూశాక.. ఈ చిత్రంపై నమ్మకం మరింత పెరిగింది. విష్ణు, లవ్‌లీ కెమిస్ట్రీ బాగుంది. సత్య, రవి కామెడీ బాగా చేశార’’న్నారు నిర్మాత. శ్రీవిష్ణు మాట్లాడుతూ.. ‘‘ఓ   విభిన్నమైన కథతో సినిమా చేయడానికి ధైర్యం చేసిన నిర్మాతలకు థ్యాంక్స్‌. అనీష్‌ తాను చెప్పిన కథని చెప్పినట్లుగా తీశారు. రాజేంద్రప్రసాద్‌  నటనకి మంచి ఆదరణ వస్తోంది. ముఖ్యంగా మైమ్‌ సీన్‌కి ప్రేక్షకులు నుంచోని క్లాప్స్‌ కొడుతున్నారు. కుటుంబంతో కలిసొచ్చి సినిమా చూస్తే మరింత ఎంజాయ్‌ చేస్తార’’న్నారు. ఈ కార్యక్రమంలో లవ్‌లీ సింగ్, సత్య, మైమ్‌ మధు తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని