అనసూయ టాటూకి అర్థమేమిటంటే..!
close
Published : 04/04/2020 15:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అనసూయ టాటూకి అర్థమేమిటంటే..!

తరుణ్‌ భాస్కర్‌తో పార్టీ.. అనసూయ కౌంటర్‌

హైదరాబాద్‌: అనసూయ.. బుల్లితెరలో ప్రసారమయ్యే పలు షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరించి ఎందరో హృదయాలను కొల్లగొట్టి.. రంగమ్మత్తగా వెండితెరపై మెప్పించిన నటి. ఆమె అందం, అభినయానికి ఎందరో ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్స్‌ నిలిచిపోవడంతో ఇంటికే పరిమితమైన అనసూయ తాజాగా ఇన్‌స్టా వేదికగా అభిమానులతో కొంతసమయం సరదాగా ముచ్చటించారు. నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సరదాగా సమాధానం చెప్పారు.

ఇదిలా ఉండగా తన గురించి వచ్చిన ఓ రూమర్‌ గురించి నెటిజన్‌ ప్రశ్నించగా.. తనదైన శైలిలో ఆ వ్యక్తికి కౌంటర్‌ ఇచ్చారు. ‘తరుణ్‌ భాస్కర్‌తో కలిసి మద్యం సేవించి ఓ పార్టీలో రచ్చ చేశారట’ అని ఓ నెటిజన్‌ అనసూయను ప్రశ్నించాడు. ‘ఈ ‘అట’ అనేవి మీరు మీరు సరదాకి అనుకుంటే బాగుంటుందేమో.. కానీ నిజాలు వేరే ఉంటాయి. నువ్వు పరిణతి చెందితే నీకు అర్థమవుతుంది. నాకు తెలిసి నువ్వు ఇంకా పరిణతి చెందినట్లు లేవు’ అని ఆమె సదరు నెటిజన్‌కు కౌంటర్‌ ఇచ్చారు. అనసూయ-తరుణ్‌ భాస్కర్‌ కలిసి.. ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. తరుణ్‌ భాస్కర్‌ కథానాయకుడిగా వెండితెరకు పరిచయమైన ఈ చిత్రంలో అనసూయ ఓ కీలకపాత్రను పోషించారు.

అనసూయను అడిగిన మిగిలిన ప్రశ్నలివి..

‘మీ చేతిపై ఉన్న టాటూకి అర్థం ఏమిటి’

అనసూయ:‘బ్యూటీ సోల్ డీప్‌ (నిశ్చలమైన మనసు కలిగిన అందమైన అమ్మాయి)’

‘మీకు అనసూయ అనే పేరు ఎందుకు పెట్టారు?’

అనసూయ: ‘అనసూయ మా నాయనమ్మ పేరు’ 

మీ స్వస్థలం ఏది..?

అనసూయ: నల్గొండ

మీకు ఇష్టమైన ప్రదేశం ఏది?

అనసూయ: మా ఇల్లు

మీకు ఇష్టమైన ఆహారం?

అనసూయ: ఇంటి భోజనం

పెళ్లి కాకముందు మీ ఇంటిపేరు ఏమిటి?

అనసూయ: ఖస్బా KHASBA

మీలో మీకు బాగా నచ్చే విషయం ఏమిటి?

అనసూయ: నాకు నేనంటే ఎంతో ఇష్టం

లాక్‌డౌన్‌ను ఫాలో అవుతున్నారా?

అనసూయ: కఠినంగా ఫాలో అవుతున్నా

షూటింగ్స్‌ మిస్‌ అవుతున్నారా?

అనసూయ: బాగా 

జబర్దస్త్‌లో కొత్త ఎపిసోడ్స్‌ ఉన్నాయా..?

అనసూయ: లేవు

మీరు ఇంత అందంగా ఉండడానికి కారణమేమిటి?

అనసూయ: నా కుటుంబం

మీరు యోగా చేస్తారా?

అనసూయ: చేస్తాను. వారంలో నాలుగుసార్లు

మీలో మీకు బాగా నచ్చే లక్షణం

అనసూయ: నేను చాలా ఎమోషనల్‌. అదే నా పవర్‌, అదే నా బలహీనత. అదే కొన్నిసార్లు నచ్చుతుంది. మరికొన్నిసార్లు నచ్చదు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని