వాళ్లే నా బలం: నమ్రత
close
Published : 05/01/2020 12:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వాళ్లే నా బలం: నమ్రత

హైదరాబాద్‌: సూపర్‌స్టార్‌ కృష్ణ, మహేశ్‌బాబు, గౌతమ్‌.. ఈ ముగ్గురు తన బలమని అంటున్నారు నమ్రత. ఈ మేరకు ఆమె కృష్ణ, మహేశ్‌, గౌతమ్‌లకు సంబంధించిన ఫొటోను ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేస్తూ ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టారు. ‘ఈ ముగ్గురు నా సూపర్‌ హీరోలు. ఈ ముగ్గురితో నా జీవితం సంపూర్ణమైంది. నా మీద ఈ ముగ్గురు చూపిస్తున్న ప్రేమ, గౌరవానికి కృతజ్ఞురాలిని. ప్రతిసారీ ఈ ముగ్గురు నాకో కొత్త విషయాన్ని నేర్పిస్తున్నందుకు సంతోషంగా ఉంది. వీళ్లే నా బలం.’ అని నమ్రత పేర్కొన్నారు.

మరోవైపు మహేశ్‌ బాబు కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మహేశ్‌కు జంటగా రష్మిక నటించారు. దిల్‌రాజు, మహేశ్‌బాబు, అనిల్‌ సుంకర నిర్మాతలుగా వ్యవహిరించారు. సంక్రాంతి కానుకగా జనవరి 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని