చైనా టు భారత్‌.. భారత విద్యార్థుల ఆనందం..
close
Updated : 03/02/2020 01:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చైనా టు భారత్‌.. భారత విద్యార్థుల ఆనందం..

మానేసర్‌: ‘ఎక్కడ చూసినా కరోనా వైరస్‌ వ్యాపిస్తోంది. రోజురోజుకూ వైరస్‌ బారిన పడి చనిపోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. మనం ఇక్కడే చిక్కుకుపోయాం. చైనా నుంచి తిరిగి భారత్‌కు ప్రాణాలతో వెళ్లగలమా? లేదా? ఏలాగైనా స్వదేశానికి తిరిగి వెళ్లాలి. వెళ్లి కుటుంబసభ్యులను కలవాలి..’ ఇది చైనాలో చిక్కుకుపోయిన భారతీయుల మనసులో మెదిలే ఆవేదన. చావుకు దగ్గరవుతున్నామా అని క్షణక్షణం అనుకుంటూ బాధపడుతున్న ఆ భారతీయులు భారత్‌కు తిరిగి వస్తే ఎలాగుంటుంది? వారి ఆనందానికి అవధుల్లేకుండా పోతుంది. సరిగా ఇక్కడా అదే జరిగింది. వైద్య పరీక్షల నిమిత్తం హరియాణాలోని మానేసర్‌లో భారత ఆర్మీ ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ వార్డుల్లో ఉన్న భారతీయులు స్వదేశానికి తిరిగి వచ్చామనే సంతోషంతో చిందులు వేయడం మొదలుపెట్టారు. చైనా నుంచి వచ్చాం కాబట్టి వారికి కూడా కరోనా వైరస్‌ సోకేందుకు అవకాశాలున్నప్పటికీ అది మర్చిపోయి ఆనందంతో నృత్యాలు చేస్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట్లో అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది.

చైనాలోని వుహాన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ రెండు రోజుల్లో ఎయిర్‌ ఇండియా ప్రత్యేక విమానంలో దాదాపు 647 మంది భారతీయులు వుహాన్‌ నుంచి దిల్లీ చేరుకున్నారు. వీరిలో 324 మంది భారతీయులు ఈరోజు ఉదయం దిల్లీ చేరుకున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతోన్న నేపథ్యంలో హరియాణాలోని మానేసర్‌లో ఏర్పాటు చేసిన ఐసోలేటెడ్‌ క్యాంపులో వీరిని 14 రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచనున్నారు. ఈ 14 రోజుల్లో వీరిలో ఎలాంటి వైరస్‌ లక్షణాలు లేకపోతే వారిని వారి ఇళ్లకు పంపిస్తారు.

క్షేమంగా భారత్‌కు చేరుకున్నామనే ఆనందంలో ఐసోలేటెడ్‌ క్యాంపులో ఉన్న వారు ఒక్కసారిగా ఆనందంతో నృత్యాలు చేయడం మొదలుపెట్టారు. ఇది గమనించిన ఎయిర్‌ ఇండియా ప్రతినిధి ధనుంజయ్‌ కుమార్ తన ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ‘స్థానిక హరియాణా జానపద పాటలకు వారు నృత్యాలు చేశారు. ఆత్మవిశ్వాసంతో కూడిన భారతీయులను చూడడం ఎంతో సంతోషంగా ఉంది’ అని భాజపా నేత, మాజీ ఆర్మీ అధికారి డా.సురేంద్ర పునియా తన ట్విటర్‌లో ఈ వీడియా షేర్‌ చేశారు.

 

 

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని