ఇవి ఉంటే పని సులువంట!
close
Published : 15/07/2021 01:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇవి ఉంటే పని సులువంట!

చిన్న చిన్న పనులే వంటను ఆలస్యం చేసి ఒత్తిడిని పెంచుతాయి. దీనికి పరిష్కారంగా కొత్త పరికరాలెన్నో వస్తున్నాయి. ఇవి ఉంటే వంటింట్లో పని సులువే...


డ్రెయినర్‌...

బియ్యం, పప్పు వంటివి కడిగి నీటిని వంపేటప్పుడు ‘డ్రెయినర్‌’ను అటాచ్‌ చేస్తే చాలు. ఒక్క గింజ కూడా పోకుండా నీటిని వంచేయొచ్చు. కాయగూరల ముక్కలను కడిగేటప్పుడు గిన్నె అంచుకు స్టెయినర్‌ క్లిప్‌ను తగిలిస్తే, నీటిని తేలికగా వంపొచ్చు.


వ్యర్థాల కోసం...

కూరగాయలు, ఆకు కూరలను తరుగుతున్నప్పుడు స్క్రాప్‌ ట్రాప్‌ను వంటింటి దిమ్మకు ఎటాచ్‌ చేసుకుంటే... వ్యర్థాలను ఎప్పటికప్పుడు దీంట్లోకి వేసి, తర్వాత ఒకేసారి డస్ట్‌బిన్‌లో పడేయొచ్చు.


ఇవి ప్రత్యేకం..

చేపలపై పొలుసును తేలిగ్గా తొలగించడానికి ప్రత్యేకం ‘ఫిష్‌ స్కేల్‌ రిమూవర్‌’. ద్రాక్ష పండ్లను సమాన ముక్కలుగా చేయగలిగే స్లైసర్‌, యాపిల్‌ మధ్యలోని గింజలను ఒకేసారి తొలగించే కోరర్‌, మొక్కజొన్న గింజలను క్షణంలో వేరుచేసే కార్న్‌ షార్క్‌ వంటివీ ఉపయోగపడతాయి. ‘యాంటీ స్పిల్‌’ గిన్నెలోని ద్రవాలను తేలిగ్గా మరో పాత్రలోకి వంచడానికి వీలుగా ఉంటుంది.


పిల్లల కోసం

కీరదోస, క్యారెట్‌ వంటివి అందమైన ఆకారంలో కట్‌ చేయడానికి స్పైరల్‌ స్లైసర్‌ ఉపయోగ పడుతుంది. రింగురింగులుగా ఆకర్షణీయంగా కనిపించే ముక్కలను పిల్లలు నోట్లో వేసుకోకుండా ఉండలేరు. రోజూ గుడ్డు తినిపించాల్సినప్పుడు చిన్నారులకు ఈ బ్రేక్‌ఫాస్ట్‌ రింగ్స్‌తో రకరకాల ఆకారాల్లో చిన్నచిన్న ఆమ్లెట్స్‌ వేసిస్తే చాలు.... లొట్టలేసి మరీ తింటారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని