Bollywood: బిగ్గెస్ట్‌ మల్టీస్టారర్‌కి గ్రీన్‌సిగ్నల్‌ - hrithik roshan saif ali khan to star in vikram vedha remake
close
Published : 10/07/2021 22:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Bollywood: బిగ్గెస్ట్‌ మల్టీస్టారర్‌కి గ్రీన్‌సిగ్నల్‌

ముంబయి: బీటౌన్‌లో మరో బిగ్గెస్ట్‌ మల్టీస్టారర్‌కు ప్రయత్నాలు షురూ అయ్యాయి. బాలీవుడ్‌ స్టార్‌హీరోలు హృతిక్‌ రోషన్‌, సైఫ్‌ అలీఖాన్‌ ప్రధాన పాత్రల్లో ఓ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ రూపుదిద్దుకోనుంది. తమిళ సూపర్‌హిట్‌ ‘విక్రమ్‌ వేద’కు హిందీ రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కనుంది. తాజాగా ఈ విషయాన్ని చిత్రబృందం వెల్లడించింది. ఒరిజినల్‌ను తెరకెక్కించిన పుష్కర్‌-గాయత్రి సంయుక్తంగా రీమేక్‌ని కూడా తీర్చిదిద్దనున్నారు.

విజయ్ సేతుపతి, మాధవన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన సూపర్‌హిట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘విక్రమ్‌ వేద’. బేతాళ కథలను ఆధారంగా చేసుకుని దీనిని తెరకెక్కించారు. 2017లో విడుదలైన ఈ సినిమాలో మాధవన్‌ పోలీస్‌ పాత్రలో, విజయ్‌ సేతుపతి రౌడీగా నటించారు. అప్పట్లో ఈసినిమా మంచి వసూళ్లు రాబట్టింది. ఇక సైఫ్‌ ప్రస్తుతం ‘భూత్‌ పోలీస్‌’ రిలీజ్‌ కోసం ఎదురుచూస్తున్నారు. ‘ఆదిపురుష్‌’ చిత్రీకరణలో పాల్గొననున్నారు. హృతిక్‌ రోషన్‌ విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన ‘ఫైటర్‌’లో నటిస్తున్నారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని