విశ్వ భారతీయం.. విదేశాల్లో మనోళ్లే టాప్‌! - indians are more in international migrants list according to un report
close
Updated : 12/05/2021 17:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విశ్వ భారతీయం.. విదేశాల్లో మనోళ్లే టాప్‌!

జెనీవా: ప్రపంచవ్యాప్తంగా విదేశాల్లో నివసిస్తున్న వారిలో భారతీయులు అగ్రస్థానంలో ఉన్నారని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. 2020 నాటికి కోటి 80లక్షల మంది భారతీయులు విదేశాల్లో నివసిస్తున్నట్లు ఐరాస ఆర్థిక, సామాజిక వ్యవహారాల విభాగం విడుదల చేసిన ‘అంతర్జాతీయ వలసలు 2020’ నివేదిక వెల్లడించింది. భారత్‌ నుంచి ఎక్కువ సంఖ్యలో ప్రజలు అమెరికా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, సౌదీ అరేబియాకు తరలివెళ్తున్నారని ఐరాస నివేదిక వెల్లడించింది. విదేశాలకు తరలివెళ్తున్న భారతీయులకు ఎక్కువగా అమెరికా గమ్యస్థానంగా మారుతోందని తెలిపింది. 

 ‘2020 వరకు భారత్‌ నుంచి కోటి 80లక్షల మంది విదేశాల్లో నివసిస్తున్నారు. భారత్‌ తర్వాత మెక్సికో, రష్యా కోటి 10 లక్షలు, చైనాలో కోటి మంది, సిరియాలో 80లక్షల మంది వేరే దేశాలకు వలస వెళ్లి నివసిస్తున్నారు. భారత్‌ నుంచి వలస వెళ్లిన వారిలో యూఏఈలో 30లక్షల మంది, అమెరికాలో 27లక్షల మంది, సౌదీ అరేబియాలో 25లక్షల మంది నివసిస్తున్నారు. ఆస్ట్రేలియా, కెనడా, కువైట్, ఒమన్‌, పాకిస్థాన్‌, ఖతార్‌, ఇంగ్లాండ్‌లోనూ అధిక సంఖ్యలో భారతీయులు నివసిస్తున్నారు’ అని నివేదిక పేర్కొంది. 

‘2000 నుంచి 2020 మధ్య విదేశాల్లో వలస జనాభా గణనీయంగా పెరిగింది. ఈ కాలంలో భారత్‌ నుంచి అత్యధికంగా కోటి మంది విదేశాలకు వెళ్లగా.. తర్వాతి స్థానంలో సిరియా, చైనా, వెనెజువెలా, ఫిలిప్పైన్స్‌లు ఉన్నాయి. 2020 నాటికి 5కోట్ల మంది వలసదారులకు అమెరికా గమ్యస్థానంగా మారింది. ఇది ప్రపంచంలోనే అత్యధికం.. మొత్తం వలసల్లో ఇది 18శాతం. అమెరికా తర్వాత జర్మనీ(1.6 కోట్లు), సౌదీ అరేబియా(1.3 కోట్లు), రష్యా(1.2 కోట్లు), బ్రిటన్‌ (90 లక్షలు) వలసదారులకు ఎక్కువగా ఆతిథ్యం ఇచ్చాయి. కరోనా నేపథ్యంలో జాతీయ సరిహద్దులు మూసివేయడం వల్ల వలసలు తగ్గాయి. 2020లో 20లక్షల వలసలు తగ్గాయి. 2019 అంచనాల కంటే ఇది 27శాతం తక్కువ. 2000 సంవత్సరంలో వేరే దేశాల్లో స్థిర పడిన వారి సంఖ్య 173 మిలియన్లు ఉండగా.. అది 2020లో 281 మిలియన్లకు చేరింది’ అని నివేదిక వెల్లడించింది. 

ఇదీ చదవండి

హారిస్‌ను అభినందించిన పెన్స్‌మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని