క్రిష్‌ కథల్లో రకుల్‌.. కానీ ఎక్కడ? - rakul preeth in krish web series or movie
close
Published : 30/07/2020 13:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

క్రిష్‌ కథల్లో రకుల్‌.. కానీ ఎక్కడ?

ఇంటర్నెట్‌ డెస్క్‌: టాలీవుడ్‌ దర్శకుడు క్రిష్‌.. పవన్‌ కల్యాణ్‌తో ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. పీరియాడికల్‌ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కబోతోంది. ప్రస్తుతం దీని కోసం కసరత్తులు చేస్తున్న క్రిష్‌.. మరోవైపు వెబ్‌సిరీస్‌లపై కూడా దృష్టి పెట్టారు. ఇప్పటికే ఆహా ఓటీటీ కోసం ‘మస్తీస్‌’ అనే కథను అందించారు. వెబ్‌సిరీస్‌ల కోసం క్రిష్‌ మరికొన్ని కథలు సిద్ధం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో క్రిష్‌ తన వద్ద ఉన్న కథల్లోని ఓ పాత్రకు హీరోయిన్‌ రకుల్‌ప్రీత్‌ను తీసుకోవాలని భావిస్తున్నారట. ఈ మేరకు రకుల్‌తో క్రిష్‌ సంప్రదింపులు కూడా జరిపారట. కానీ రకుల్‌ తన నిర్ణయాన్ని ఇంకా వెల్లడించలేదు. అయితే ఇక్కడే సినీ వర్గాల్లో రెండు వాదనలు వినిపిస్తున్నాయి. రకుల్‌ను పవన్‌తో తెరకెక్కిస్తున్న సినిమాలో హీరోయిన్‌గా తీసుకుంటున్నారని, కాదు.. కాదు.. వెబ్‌ సిరీస్‌ల్లో ఒకటి మహిళా ప్రాధాన్యం ఉన్న కథ ఉందని.. అందులో నటించాలని రకుల్‌ను క్రిష్‌ కోరినట్లు వాదనలు వినిపిస్తున్నాయి. మరి రకుల్‌ నటించేది సినిమాలోనా? వెబ్‌సిరీస్‌లోనా? తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని