బావామరుదుల సవాల్‌ - telugu news antim firstlook poster released by salmankhan
close
Published : 08/09/2021 11:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బావామరుదుల సవాల్‌

సల్మాన్‌ఖాన్‌, ఆయన బావమరిది ఆయుష్‌ శర్మ ఢీ అంటే ఢీ అంటూ సవాళ్లు విసురుకుంటున్నారు. నిజంగా కాదు వెండితెరపై ఈ ఇద్దరూ తలపడుతున్న చిత్రం ‘అంతిమ్‌’. ‘ది ఫైనల్‌ ట్రూత్‌’ అనేది ఉపశీర్షిక. ఇందులో గ్యాంగ్‌స్టర్‌ పాత్రలో ఆయుష్‌, పోలీస్‌ అధికారిగా సల్మాన్‌ నటించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన తొలి పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో తీవ్రమైన చూపులతో ఒకరినొకరు చూసుకుంటున్న ఈ పోస్టర్‌ను కథ ఎలా  ఉండనుందో చెప్పేలా ఉంది. నటుడు మహేష్‌ మంజ్రేకర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సల్మాన్‌ఖాన్‌ ఫిలిమ్స్‌పై సల్మాన్‌ఖాన్‌ నిర్మించారు. ‘‘చెడు అంతం మొదలైంది... గణపతి బప్పా మోరియా’అంటూ పోస్టర్‌ను పంచుకుంటూ సల్మాన్‌ ట్వీట్‌ చేశారు. ప్రగ్యా జైశ్వాల్‌ ఓ కీలక పాత్రలో నటిస్తోంది. విడుదల తేదీపై ఇంకా స్పష్టత రాలేదు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని