Corona: వేదాకృష్ణమూర్తి ఇంట మరో విషాదం - veda krishnamurthy loses her sister after mothers death to coronavirus
close
Updated : 06/05/2021 21:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Corona: వేదాకృష్ణమూర్తి ఇంట మరో విషాదం

తల్లిని కోల్పోయిన రెండు వారాలకే..

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా మహిళా జట్టు ఆల్‌రౌండర్‌ వేదా కృష్ణమూర్తి ఇంట కరోనా వైరస్‌ రెండో విషాదాన్ని మిగిల్చింది. రెండు వారాల క్రితం ఆమె తల్లి చెలువాంబ దేవిని పొట్టనబెట్టుకున్న కొవిడ్‌-19.. తాజాగా ఆమె సోదరి వాత్సల శివకుమార్‌ను సైతం బలితీసుకుంది. దాంతో రెండు వారాల వ్యవధిలో టీమ్‌ఇండియా క్రికెటర్‌ తన తల్లిని, సోదరిని కోల్పోవాల్సి వచ్చింది. గతరాత్రి చిక్‌మగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆమె సోదరి మరణించారు.

కాగా, కరోనా విపత్కర పరిస్థితుల్లో వేదా సామాజిక మాధ్యమాల ద్వారా అవసరమైన వారికి సహాయ సహకారాలు అందిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచింది. అలాంటి ఆమెకే ఇలాంటి విషాదం జరగడం అభిమానులను కలచివేసింది. తొలుత ఏప్రిల్‌ 24న తన తల్లి కరోనాతో కన్నుమూశారని వేదా ఓ ట్వీట్‌ చేసింది. అప్పుడే తనకు నెగిటివ్‌గా తేలగా తన సోదరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు పేర్కొంది. తన సోదరి ఆరోగ్యంగా తిరిగి రావాలని ఆకాంక్షించింది. కానీ, చివరికి గతరాత్రి ఆమె కూడా మరణించడంతో వేదా కుటుంబం అంతులేని దుఖఃసాగరంలో మునిగిపోయింది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని