గ్రహాంతర వాసుల కథలో తాప్సి?
close
Updated : 25/06/2021 02:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గ్రహాంతర వాసుల కథలో తాప్సి?

బాలీవుడ్‌లో జోరు చూపిస్తుంది తాప్సి. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు పోషిస్తూ ముందుకెళుతోంది. తాజాగా ఆమె ఓ పాన్‌ ఇండియా కథకు ఓకే చెప్పినట్టు సమాచారం. అది ఓ సైన్స్‌ ఫిక్షన్‌ కథని, దానికి ‘ఏలియన్‌’ అనే పేరుని అనుకుంటున్నట్టు సమాచారం. భరత్‌ నీలకంఠన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది. ‘‘గ్రహాంతర వాసుల నేపథ్యంగా సాగే సైన్స్‌ ఫిక్షన్‌ కథ ఇది. ఎక్కడా హాలీవుడ్‌ ఏలియన్‌ సినిమాల ఛాయలు ఇందులో కనిపించవు.కొత్తగా ఉంటుంది. భారతదేశంలో ఏలియన్స్‌ ఉంటే ఎలా ఉంటుంది అనే కథాంశంతో ఈ చిత్రం ఉండనుంది’’అని బాలీవుడ్‌ వర్గాల్లో వినిపిస్తోంది. విజువల్‌ ఎఫెక్ట్స్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తూ ఎక్కువ భాషల్లో ఇది తెరకెక్కనుంది. తాప్సి త్వరలోనే ‘శెభాష్‌ మిథు’ చిత్రీకరణలో పాల్గొననుంది. ఆమె నటించిన ‘హాసిన్‌ దిల్‌రూబా’ జులైలో ఓటీటీలో విడుదల కానుంది. ఇంకా ‘రష్మీ రాకెట్‌’, ‘లూప్‌ లపేటా’ తదితర చిత్రాలు తాప్సి చేతిలో ఉన్నాయి.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని