close
Published : 07/04/2021 18:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఇది నా డెత్‌ డే: ఆర్జీవీ

దర్శకుడి ట్వీట్‌కు ప్రముఖ నిర్మాణ సంస్థ రిప్లై

హైదరాబాద్‌: ‘ఈ రోజు నా బర్త్‌డే కాదు డెత్‌ డే’ అని అంటున్నారు ప్రముఖ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ. యాక్షన్‌, హారర్‌, క్రైమ్‌, సస్పెన్స్‌ థ్రిల్లర్‌.. ఇలా ఎన్నో జోనర్లలో విభిన్నమైన చిత్రాలు తెరకెక్కించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారాయన. బుధవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు సోషల్‌మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. వరుస శుభాకాంక్షలపై స్పందించిన ఆయన.. ‘ఈరోజు నా పుట్టినరోజు కాదు. కానీ ఇది నా డెత్‌ డే. ఎందుకంటే ఈరోజు నా జీవితంలో మరో సంవత్సరం ముగిసిపోయింది’ అని ట్వీట్‌ చేశారు. 

కాగా, ఆర్జీవీ పెట్టిన ఈ ట్వీట్‌పై ప్రముఖ నిర్మాణ సంస్థ సురేశ్‌ ప్రొడక్షన్స్‌ స్పందించింది. ‘జీవితమంటే ఎంత ఎక్కువకాలం జీవించామన్నది కాదు.. ఎంత గొప్పగా జీవించామన్నదే ముఖ్యం’ అని పేర్కొంది. అలాగే ఓ సినీ రచయిత బర్త్‌డే విషెస్‌పై స్పందించిన వర్మ.. ‘నో థాంక్స్‌’ అని అన్నారు.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని