SundeepKishan: 28వ చిత్రం ఖరారైంది - sundeep kishan with vi anand
close
Published : 07/05/2021 14:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

SundeepKishan: 28వ చిత్రం ఖరారైంది

ఇంటర్నెట్‌ డెస్క్‌: యువ నటుడు సందీప్‌ కిషన్‌ కొత్త చిత్రాన్ని ఖరారు చేశాడు. శుక్రవారం తన పుట్టిన రోజు సందర్భంగా ఈ విషయాన్ని ప్రకటించాడు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల వేదికగా ఓ పోస్టర్‌ని విడుదల చేశాడు. ‘ఎక్కడికి పోతావు చిన్నివాడా’, ‘ఒక్క క్షణం’, ‘డిస్కోరాజా’ తదితర విభిన్న కథలతో అలరించిన వి.ఐ. ఆనంద్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. హాస్య మూవీస్‌ పతాకంపై ‘ఎస్‌కే 28’ వర్కింగ్‌ టైటిల్‌తో రాజేశ్‌ నిర్మిస్తున్నారు. ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కనుందని సమాచారం.

టైటిల్‌, నాయిక, సాంకేతిక నిపుణుల వివరాలు మరికొన్ని రోజుల్లో తెలియనున్నారు. జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో సందీప్‌ నటించిన ‘గల్లీ రౌడీ’ విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతోపాటు ‘వివాహ భోజనంబు’ చిత్రంలో అతిథి పాత్ర పోషించాడు సందీప్‌. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.



మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని