ఇంట్లో తెలిసిపోతుందనే డిగ్రీ విద్యార్థిని ‘కట్టు’కథ
close

తాజా వార్తలు

Published : 04/03/2021 01:33 IST

ఇంట్లో తెలిసిపోతుందనే డిగ్రీ విద్యార్థిని ‘కట్టు’కథ

విజయనగరం (రింగురోడ్డు): విజయనగరం జిల్లాలో గుర్ల వద్ద ఓ డిగ్రీ విద్యార్థిని కాళ్లు, చేతులు కట్టేసి తుప్పల్లో పడేసినట్లుగా నమోదైన కేసులో మిస్టరీ వీడింది. తన కుటుంబసభ్యులను నమ్మించేందుకు ఆ విద్యార్థిని ‘కట్టు’కథ అల్లినట్లు పోలీసుల విచారణలో తేలింది. స్నేహితులతో బయటకు వెళ్లినట్లు ఇంట్లో తెలిసిపోతుందని విద్యార్థిని ఆవిధంగా నాటకమాడింది. కుటుంబసభ్యులను నమ్మించేందుకు తానే కాళ్లు, చేతులు కట్టుకున్నట్లు ఆమె పోలీసుల విచారణలో అంగీకరించింది. ఈ మేరకు జిల్లా ఎస్పీ రాజకుమారి ఓ ప్రకటనలో కేసు వివరాలు వెల్లడించారు.

‘‘డిగ్రీ విద్యార్థిని ఫిబ్రవరి 27న బాబాయ్‌ దగ్గరకు వెళ్తానని చెప్పి హాస్టల్‌లో పర్మిషన్‌‌ తీసుకుని తనకు తెలిసిన స్నేహితుడిని కలిసేందుకు బయటకు వెళ్లింది. అదే సమయంలో ఆమె సోదరుడు తన గురించి హాస్టల్‌లో వాకబు చేసినట్లు తెలుసుకుంది. స్నేహితుడిని కలిసిన తర్వాత తిరుగు ప్రయాణంలో పాలకొల్లు నుంచి పాలకొండ వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్‌ బస్సు ఎక్కింది. గుర్ల దాటిన తర్వాత బస్సు దిగిన యువతి.. రోడ్డు పక్కన ఉన్న తుప్పల్లోకి వెళ్లి తనకు తానే కాళ్లు, చేతులను చున్నీతో కట్టుకుని అపస్మారక స్థితిలో పడి ఉన్నట్లుగా నటించినట్లు అంగీకరించింది’’ అని ఎస్పీ రాజకుమారి తెలిపారు. విద్యార్థిని స్వస్థలం తెర్లాం మండలం లోచర్లగా గుర్తించామన్నారు. ఈకేసు విచారణలో విజయనగరం డీఎస్పీ పి.అనిల్‌ కుమార్, దిశ మహిళా పీఎస్‌ డీఎస్పీ టి. త్రినాథ్‌, విజయనగరం రూరల్‌ సీఐ ఎస్‌.మంగవేణి, గుర్ల ఎస్సై నీలావతి, విజయనగరం రూరల్‌ ఎస్సై పి.నారాయణరావు సమర్థంగా పనిచేసి 48 గంటల్లోనే వాస్తవాలను వెలికితీసి కేసును ఛేదించారని వెల్లడించారు. వారిని అభినందిస్తున్నట్లు ఎస్పీ చెప్పారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని