close

ప్రధానాంశాలు

Published : 11/04/2021 04:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అదే టిప్పర్‌.. అదే డ్రైవర్‌

12 రోజుల్లో 2 ప్రమాదాలు.. ఇద్దరి మృతి

నిజామాబాద్‌ నేరవార్తలు, న్యూస్‌టుడే: ఒకే టిప్పర్‌.. ఒకే డ్రైవర్‌ కారణంగా 12 రోజుల వ్యవధిలో జరిగిన రెండు ప్రమాదాల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మార్చి 30న నిజామాబాద్‌ జిల్లా గ్రామీణ మండలం మల్లారం గ్రామ కార్యదర్శి ఉమాకాంత్‌ను టిప్పర్‌ ఢీకొనడంతో చనిపోయారు. ఆ కేసులో పోలీసులు టిప్పర్‌ను స్వాధీనం చేసుకుని, డ్రైవర్‌ గంగాధర్‌ను అదుపులో తీసుకొన్నారు. గంగాధర్‌ అదే రోజు బెయిల్‌పై విడుదలయ్యాడు. టిప్పర్‌ను మూడ్రోజుల కిందట తిరిగి అప్పగించారు. తాజాగా శనివారం నిజామాబాద్‌ నగరంలోని ఇంద్రాపూర్‌ సమీపంలో సైకిల్‌పై వెళ్తున్న నక్క కృష్ణ(46)ను టిప్పర్‌ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మరోసారి ప్రమాదానికి కారణమవడంతో నిజామాబాద్‌ ఐదో ఠాణా పోలీసులు గంగాధర్‌పై కేసు నమోదు చేశారు. డ్రైవింగ్‌ లైసెన్సు రద్దు చేయాలని రవాణాశాఖ అధికారులకు సిఫార్సు చేయనున్నట్లు ఎస్సై జాన్‌రెడ్డి పేర్కొన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన