నగరానికి చేరుకున్న‘సుదర్శన్‌ భారత్‌ పరిక్రమ’ యాత్ర
eenadu telugu news
Updated : 17/10/2021 05:28 IST

నగరానికి చేరుకున్న‘సుదర్శన్‌ భారత్‌ పరిక్రమ’ యాత్ర

గాంధీకొండపై స్మారక స్తూపం వద్ద నివాళి అర్పిస్తున్న కమెండోలు

చిట్టినగర్‌, న్యూస్‌టుడే: విజయవాడ గాంథీకొండపై కొలువుదీరిన గాంధీ స్మారక స్తూపాన్ని ఎన్‌ఎస్‌జీ బ్లాక్‌ క్యాట్‌ కమెండోలు శనివారం సందర్శించి, నివాళి అర్పించారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్స్‌ (ఎన్‌ఎస్‌జీ) ఆధ్వర్యంలో ‘సుదర్శన్‌ భారత్‌ పరిక్రమ’ పేరుతో ప్రత్యేక యాత్ర చేపట్టారు. అందులో భాగంగా బ్లాక్‌క్యాట్‌ కమెండోల కార్ల ర్యాలీ శనివారం విజయవాడ చేరుకుంది. ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌జీ కల్నల్‌ రాథోడ్‌ మాట్లాడుతూ అక్టోబర్‌ 2 నుంచి ప్రారంభమైన ర్యాలీ దేశంలోని 18 నగరాల మీదుగా 7,500 కిలోమీటర్లు మేర కొనసాగుతుందన్నారు. భారత స్వాతంత్ర ఉద్యమానికి ప్రతీకగా నిలిచిన గాంధీ కొండపై తమ కమెండోలు ర్యాలీ నిర్వహించడం స్ఫూర్తినిచ్చిందన్నారు. హైదరాబాద్‌ మీదుగా ఈ నెల 30న దిల్లీ చేరుకుని, జాతీయ పోలీసు స్మారక చిహ్నం వద్ద యాత్ర ముగియనున్నట్లు వివరించారు.

కరెన్సీనగర్‌, న్యూస్‌టుడే: తొలుత నగరానికి చేరుకున్న యాత్ర బృందం హెల్త్‌వర్సిటీ ఎదురుగా ఉన్న జాస్పర్‌ టాటా కార్ల షోరూమ్‌కు చేరుకుంది. ఈ యాత్రకు వాహనాలను టాటా సంస్థ సమకూర్చింది. ఈ నేపథ్యంలో షోరూమ్‌లో కేకు కోసి సంబరాలు చేసుకున్నారు. కమెండోలను షోరూమ్‌ ప్రతినిధులు రఘురామ్‌ తదితరులు సత్కరించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని