6న గిరిజనుల రౌండ్‌టేబుల్‌ సమావేశం
eenadu telugu news
Published : 04/08/2021 01:48 IST

6న గిరిజనుల రౌండ్‌టేబుల్‌ సమావేశం


కరపత్రాలు ఆవిష్కరిస్తున్న గిరిజన సంఘాల నాయకులు

గుంటూరు, న్యూస్‌టుడే: ఈ నెల 6న విజయవాడలోని ప్రెస్‌క్లబ్‌లో మైదాన ప్రాంత గిరిజనుల రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు గిరిజన విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షుడు కె.పాండు నాయక్‌ తెలిపారు. గుంటూరు అరండల్‌పేటలోని ఎస్సీ, ఎస్టీ రైల్వే ఎంప్లాయిస్‌ యూనియన్‌ కార్యాలయంలో మంగళవారం ఈ మేరకు కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో వైకాపా అధినేత జగన్‌మోహన్‌రెడ్డి గిరిజనులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదన్నారు. స్వాతంత్య్రం వచ్చి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ గిరిజనులు అన్ని రంగాల్లో వెనుకబాటుకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో తమ సంఘీయుల అభ్యున్నతికై అనుసరించాల్సిన భవిష్యత్తు కార్యాచరణపై రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఎల్‌హెచ్‌పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.శివనాయక్‌, గిరిజన సేన రాష్ట్ర అధ్యక్షుడు నాగేంద్ర నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని