మద్యానికి బానిసై ఇద్దరు యువకుల బలవన్మరణం
eenadu telugu news
Published : 16/09/2021 03:41 IST

మద్యానికి బానిసై ఇద్దరు యువకుల బలవన్మరణం

నాచారం: అనారోగ్యం, మద్యానికి బానిసై ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన బుధవారం నాచారం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. సీఐ కిరణ్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. నాచారం బాబానగర్‌కు చెందిన వినోద్‌కుమార్‌(25) మూర్ఛతో పాటు, దీర్ఘకాలిక వ్యాధులతో కొంతకాలం నుంచి మానసికంగా బాధపడుతున్నారు. ఈ క్రమంలో కల్లు, మద్యానికి బానిసగా మారాడు. తాగేందుకు డబ్బులు లేకపోవడంతో జీవితంపై విరక్తి చెంది బుధవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.

మల్లాపూర్‌లో.. మల్లాపూర్‌లో మద్యానికి బానిసై ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సీఐ కిరణ్‌కుమార్‌ కథనం ప్రకారం.. సుభాష్‌నగర్‌కు చెందిన కె.దుర్గాప్రసాద్‌(21) మంగళవారం రాత్రి భోజనం చేసి బయటకు వెళ్లి ఇంటికి వచ్చి పడుకున్నారని...తర్వాత ఏమి జరిగిందో తెలియదు. పడక గదిలో తలుపునకు గడియ పెట్టి ఫ్యానుకు ఉరేసుకుని బలవన్మరణం చెందారు. ఉదయం 10 గంటలవుతున్నా కుమారుడు తలుపు తీయక పోవడంతో తల్లిదండ్రులు కిటికీ తలుపులు తెరిచి చూడగా మృతదేహం వేలాడుతూ కనిపించింది. మృతదేహాన్ని గాంధీకి తరలించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని