నేటి నుంచి ఇంటర్‌ మూల్యాంకనం
eenadu telugu news
Published : 19/09/2021 05:07 IST

నేటి నుంచి ఇంటర్‌ మూల్యాంకనం

కలెక్టరేట్‌(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: ఇంటర్మీడియట్‌ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ఆదివారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఆర్‌ఐవో ఎస్‌.తవిటినాయుడు తెలిపారు. సంస్కృతం సబ్జెక్టు ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాల్లో ప్రారంభమవుతుందన్నారు. ఇంటర్మీడియట్‌ ఆఫ్‌లైన్‌ ప్రవేశాలూ ఆదివారం నుంచి ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. మొదటి ఏడాది విద్యార్థులకు ఈ నెల 29 నుంచి తరగతులు నిర్వహిస్తామని వివరించారు. విద్యార్థులు ఆయా కళాశాలలకు వెళ్లి ప్రవేశాలు పొందవచ్చని సూచించారు. ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ బెటర్‌మెంట్‌ పరీక్షలకు 25,745 మంది శనివారం హాజరైనట్లు వెల్లడించారు.


విద్యార్థులకు ఉచిత బస్సు పాసులు

అరసవల్లి, న్యూస్‌టుడే: ఆర్టీసీ బస్సుల్లో 12 ఏళ్లలోపు బాలురు, పదో తరగతి చదివే 18 ఏళ్లలోపు బాలికలకు ఉచితంగా పాసులను ఇస్తామని డివిజనల్‌ మేనేజరు జి.వరలక్ష్మి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటి నుంచి పాఠశాల 20 కి.మీ. దూరం ఉండాలని చెప్పారు. ఇతర విద్యార్థులకు నెల, మూడు నెలల, సంవత్సర కాల పరిమితితో రుసుం తీసుకొని మంజూరు చేస్తామన్నారు. విద్యార్థులు పాసుల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని ఆర్టీసీ అధికారులను సంప్రదించాలని కోరారు. ఉద్యోగులు, వ్యాపారులకు సీజనల్‌ పాసులనూ అందిస్తున్నట్లు వివరించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని