Published : 12/04/2021 03:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టెన్నిస్‌ పోటీల విజేత విశాఖపట్నం

రాష్ట్రస్థాయి పోటీల విజేతలు

కాకినాడ, న్యూస్‌టుడే: కాకినాడలోని రంగరాయ వైద్య కళాశాల వేదికగా మూడు రోజులుగా నిర్వహించిన రాష్ట్రస్థాయి టెన్నిస్‌ పోటీలు ఆదివారంతో ముగిశాయి. అండర్‌-16 బాలబాలికలు, పురుష, మహిళల విభాగంలో నిర్వహించిన పోటీలు ఆద్యంతం ఉత్సాహంగా జరిగాయి. చివరి రోజు జరిగిన పోటీల్లో విజేతలకు రాష్ట్ర టెన్నిస్‌ అసోసియేషన్‌ కార్యదర్శి రామ్‌కుమార్‌, కాకినాడ సంఘం అధ్యక్షుడు డా.శేషగిరి చేతలు మీదుగా పతకాలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. పోటీల్లో ఓవరాల్‌ ఛాంపియన్స్‌గా విశాఖ జిల్లా నిలిచింది. ఆర్‌ఎంసీ పీడీ డా.స్పర్జన్‌రాజు, క్రీడాకారులు, కోచ్‌లు తదితరులు పాల్గొన్నారు.  
విజేతల వివరాలు..(ప్రథమ, ద్వితీయ స్థానాలు వరుసగా..) : సింగిల్స్‌ (పురుషులు) విభాగంలో అనంత్‌ (విశాఖ) శ్రీనివాస్‌ (తూర్పు గోదావరి),  మహిళల విభాగంలో సోమిత (గుంటూరు) లావణ్య (కృష్ణా).  సింగిల్స్‌లో అండర్‌-16 (బాలురు) జయదేవ్‌ ఆర్య (విశాఖ), రంగ రిషిత్‌ (తూర్పు గోదావరి) బాలికల విభాగంలో సుందరనీడి స్నేహ (విశాఖ), సంజన (విశాఖ) తొలి రెండు స్థానాలను కైవసం చేసుకున్నారు.  
బృందం (పురుషులు): విశాఖపట్నం, చిత్తూరు, కృష్ణా,  మహిళా విభాగంలో కృష్ణా, అనంతపురం, తూర్పు గోదావరి వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచాయి.  
బృందం అండర్‌-16 (బాలురు): విశాఖపట్నం, చిత్తూరు, తూర్పుగోదావరి, అనంతపురం, బాలికల విభాగంలో విశాఖపట్నం, కృష్ణా, చిత్తూరు, తూర్పు గోదావరి మొదటి నాలుగు స్థానాల్లో నిలిచాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని