గర్భిణిని తీసుకెళ్తున్న వాహనం నిలిపివేత
eenadu telugu news
Published : 29/09/2021 01:40 IST

గర్భిణిని తీసుకెళ్తున్న వాహనం నిలిపివేత

పోలీసులపై స్థానికుల ఆగ్రహం

గర్భిణి ప్రయాణిస్తున్న కారు

అల్లాదుర్గం న్యూస్‌టుడే: గర్భిణిని ఆసుపత్రికి తీసుకెళ్తున్న వాహనాన్ని పోలీసులు నిలపడంపై స్థానికులు మంగళవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం నారాయణఖేడ్‌కు చెందిన గర్భిణి శిల్పను మెదక్‌లోని ఓ ఆసుపత్రికి తన సోదరుడు కారులో తీసుకెళ్తున్నారు. అల్లాదుర్గం శివారులో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్న క్రమంలో వీరి కారును తనిఖీ చేయగా రూ.2070 జరిమానా పెండింగ్‌లో ఉందని గమనించారు. ఆ మొత్తాన్ని చెల్లించాలని పోలీసులు కోరారు. తన వద్ద నగదు లేదని ఫోన్‌ పే చేస్తానని చెప్పినా వారు వినలేదని బాధితులు పేర్కొన్నారు. తన సోదరి గర్భిణిగా ఉందని, అత్యవసర వైద్యం అవసరమని కోరినా పోలీసులు పట్టించుకోలేదన్నారు. బతిమిలాడుకుంటే అరగంట తరువాత వదిలారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై ఎస్‌ఐ మోహన్‌రెడ్డిని సంప్రదించగా కారులో గర్భిణి ఉన్న విషయం మొదట చెప్పలేదన్నారు. తరువాత చెప్పడంతో పరిశీలించగా వైద్య పరీక్షల నిమిత్తం తీసుకెళ్తున్నట్లు అనిపించి వెంటనే వదిలేశామన్నారు. 18 వాహనాలను 45 నిమిషాల పాటు తనిఖీ చేశామనీ, అరగంట సమయం ఆపలేదని స్పష్టం చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని