close

ఆదివారం, ఆగస్టు 25, 2019

ప్రధానాంశాలు

మోమిన్‌పేట తహసీల్దార్‌కు తాఖీదులు

మోమిన్‌పేట, న్యూస్‌టుడే: భూ సమస్యల పరిష్కారంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారే ఆరోపణలపై మోమిన్‌పేట తహసీల్దార్‌ సంధ్యకు జిల్లా పాలనాధికారిణి అయేషా తాఖీదులు జారీ చేశారు. బుధవారం వికారాబాద్‌ ఎమ్మెల్యే ఆనంద్‌ తహసీల్దార్‌ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంలో కార్యాలయం వద్ద వేచి ఉన్న రైతులు తమ భూములకు సంబంధించిన సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. నెలల తరబడి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పరిష్కరించడం లేదని వాపోయారు. దీంతో సమస్యను ...మిగతా 7 లోఉన్నతాధికారులకు తెలియచేయగా తహసీల్దారుకు గురువారం పాలనాధికారిణి తాఖీదులు జారీ చేశారు. ఈ విషయంపై తహసీల్దార్‌ సంధ్యను ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా.. షోకాజ్‌ నోటీసు అందిన మాట వాస్తవమేనని తెలిపారు. అయితే రైతుల విషయంలో కాదని, ఎమ్మెల్యే కార్యాలయాన్ని సందర్శించినప్పుడు ఆగ్రహించిన విషయమై తాఖీదు అందినట్లు వివరించారు. తాను తహసీల్దార్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత చాలా సమస్యలు పరిష్కరించినట్లు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.