close

ఆదివారం, డిసెంబర్ 08, 2019

ప్రధానాంశాలు

బాల్యాన్ని కాపాడుకుందాం

చైల్డ్‌ ఫ్రెండ్లీ పోలీసుస్టేషన్‌ ప్రారంభంలో సీపీ మహేష్‌భగవత్‌

బోడుప్పల్‌, న్యూస్‌టుడే: పరిశ్రమలు, ఇటుక బట్టీలు, కార్ఖానాల్లో బందీగా మారుతున్న బాల్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేష్‌భగవత్‌ అన్నారు. ప్రేమ, ఆప్యాయత, అనురాగాల మధ్య పెరగాల్సిన బాల్యం వేధింపులకు గురవుతోందన్నారు. గురువారం మేడిపల్లి స్టేషన్‌లో నూతనంగా చైల్డ్‌ ఫ్రెండ్లీ పోలీస్‌స్టేషన్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ఈ తరహా పోలీసు వ్యవస్థను అందుబాటులోకి తెచ్చిన ఘనత రాచకొండ పోలీసులదే అన్నారు. తమ పరిధిలోని అన్ని స్టేషన్లలో పిల్లల కోసం ఇలాంటి స్టేషన్ల ఏర్పాటుకు కృషి చేయనున్నట్లు పేర్కొన్నారు. బాలల హక్కులను హరిస్తూ శ్రమదోపిడీకి పాల్పుడే వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామని, చిన్నారులు ఏ సమస్య ఎదురైనా నేరుగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. పెరిగిపోతున్న సాంకేతిక పరిజ్ఞానం వింతపోకడలకు దారితీస్తోందని, తెలిసీ తెలియని వయసులో మోసాలు, హింసాత్మకత వైపు ఆకర్షితులవుతున్నవారి సంఖ్యపై ప్రత్యేక నిఘా ఏర్పాటుచేస్తున్నట్లు చెప్పారు. రాచకొండ సంయుక్త కమిషనర్‌ సుధీర్‌బాబు, మల్కాజిగిరి డీసీపీ రక్షతమూర్తి, షీ టీం నిర్వాహకురాలు సలీమా, మల్కాజిగిరి ఏసీపీ నర్సింహారెడ్డి, మేడిపల్లి ఇన్‌స్పెక్టర్‌ బి.అంజిరెడ్డి, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు మాతృఅభయ రమేష్‌ పాల్గొన్నారు.

ఆకట్టుకున్న ఇషాంత్‌
పోలీసు అధికారులతో పాటు సభావేదికపై ఉన్న ఇషాంత్‌ అందరినీ ఆకట్టుకున్నాడు. మేక్‌ ఏ విష్‌ స్వచ్చంధ సంస్థ అభ్యర్థన మేరకు ఇషాంత్‌ పోలీసు కమిషనర్‌ వేషధారణలో కనిపించాడు. చైల్డ్‌ ఫ్రెండ్లీ పోలీసుస్టేషన్‌ ప్రారంభం సందర్భంగా రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ ఇషాంత్‌కు సెల్యూట్‌చేసి స్వాగతం పలికారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.