close

సోమవారం, జనవరి 20, 2020

ప్రధానాంశాలు

క్రైమ్

కస్సుమన్న ఆర్టీసీ బస్సు

● నేటినుంచి పెరిగిన ఛార్జీల అమలు

● దూరప్రాంత ప్రయాణికులపై అధిక భారం

వి.ఎల్‌.పురం (రాజమహేంద్రవరం), న్యూస్‌టుడే: ఏపీఎస్‌ ఆర్టీసీ ఛార్జీలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంగళవారం అర్ధరాత్రి నుంచే కొత్త ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. పల్లెవెలుగు బస్సుల్లో కిలోమీటరుకు 10 పైసలు, ఎక్స్‌ప్రెస్‌లు, డీలక్స్‌, సూపర్‌ లగ్జరీ, ఏసీ బస్సుల్లో కిలోమీటరుకు 20 పైసలు చొప్పున పెంచడంతో జిల్లా నుంచి దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులపైనే ఎక్కువ భారం పడనుంది. జిల్లా పరిధిలో పల్లెవెలుగు బస్సుల్లో తిరిగే గ్రామీణ ప్రాంత ప్రయాణికులపై అంతగా భారం ఉండదు. వీటిలో ప్రయాణించేవారికి రెండు స్టేజీల వరకు పెరగనప్పటికీ తరువాత ప్రతి కిలోమీటరుకు అదనపు ఛార్జీ పడనుంది. జిల్లాలో ఆర్టీసీ అద్దె బస్సులతో కలిపి రోజూ 795 సర్వీసులను నడుపుతోంది. వీటిలో పల్లెవెలుగు 475 ఉండగా మిగతా 320 బస్సుల్లో ..మిగతా 9లోఎక్స్‌ప్రెస్‌లు 65, సూపర్‌ లగ్జరీ 140, అల్ట్రాడీలక్స్‌ 82, మిగిలినవి ఏసీ బస్సులు(ఇంద్రా, వెన్నెలా, గరుడా, నైట్‌రైడర్స్‌) ఉన్నాయి. జిల్లాలో మొత్తం తొమ్మిది డిపోల పరిధిలో 251 రూట్లలో 3.50 లక్షల కిలోమీటర్ల మేర ఆర్టీసీ బస్సులను నడుపుతోంది. వీటిలో రోజుకు సుమారు రెండు లక్షల మంది ప్రయాణికులు వారి గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. టిక్కెట్‌ ఛార్జీల రూపంలో ఇప్పటివరకు రోజుకు రూ. 90 లక్షల నుంచి రూ. కోటి వరకు రాబడి వస్తోంది. గతంలో పోలిస్తే నెలవారీ రాబడి పెరిగినప్పటికీ దానికి తగ్గట్టుగా నిర్వహణ ఖర్చులు, సిబ్బంది జీతాలు పెరగడంతో ఆర్టీసీకి నష్టాలు తప్పడం లేదు. సంస్థ ఈ నష్టాల బారినుంచి బయట పడాలంటే ఛార్జీలను పెంచక తప్పదని అధికారులు పేర్కొంటున్నారు.

 

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.