close

ఆంధ్రప్రదేశ్‌-లోక్‌సభా స్థానాలు

హిందూపురం లోక్‌సభ నియోజకవర్గం 

హిందూపురం లోక్‌సభ నియోజకవర్గం 1957లో ఏర్పడింది. మొదటి పార్లమెంట్ ఎన్నికల సమయంలో పెనుకొండ పార్లమెంట్ నియోజకవర్గంగా ఉండేది. ప్రజాపార్టీకి చెందిన కె.ఎస్.రాఘవాచారి ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1957 నుంచి హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గంగా రూపాంతరం చెందింది. ప్రస్తుతం ఇది జనరల్‌ కేటగిరీలో ఉంది. 

హిందూపురం, మడకశిర, పెనుకొండ, రాప్తాడు,  ధర్మవరం, కదిరి, పుట్టపర్తి అసెంబ్లీ నియోజకవర్గాలు దీని పరిధిలోకి వస్తాయి. ఇప్పటివరకూ జరిగిన ఎన్నికల్లో పదిసార్లు కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించగా, అయిదుసార్లు తెదేపా గెలుపొందింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో  వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి శ్రీధర్‌రెడ్డిపై తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నిమ్మల కిష్టప్ప 98,754ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. 

గెలుపొందిన అభ్యర్థులు వీరే!
* 1957-62: కె.వి.రామకృష్ణారెడ్డి (కాంగ్రెస్‌)
* 1962-67: కె.వి.రామకృష్ణారెడ్డి (కాంగ్రెస్‌)
* 1967-71: నీలం సంజీవరెడ్డి(కాంగ్రెస్‌)
* 1971-77: పి.బాయపరెడ్డి(కాంగ్రెస్‌)
* 1977-80: పి.బాయపరెడ్డి(కాంగ్రెస్‌)
* 1980-84: పి.బాయపరెడ్డి(కాంగ్రెస్‌)
* 1984-89: కె.రామచంద్రారెడ్డి(కాంగ్రెస్‌)
* 1989-91: సానిపల్లి గంగాధర(కాంగ్రెస్‌)
* 1991-96: సానిపల్లి గంగాధర(కాంగ్రెస్‌)
* 1996-98: ఎస్.రామచంద్రారెడ్డి(తెదేపా)
* 1998-99: సానిపల్లి గంగాధర(కాంగ్రెస్‌)
* 1999-04: బి.కె.పార్థసారథి(తెదేపా)
* 2004-09:  జి.నిజాముద్దీన్(కాంగ్రెస్‌)
* 2009-14: నిమ్మల కిష్టప్ప(తెదేపా)
* 2014-19: నిమ్మల కిష్టప్ప(తెదేపా)



మరిన్ని