యాదాద్రి జిల్లాలో నలుగురికి పాజిటివ్

తాజా వార్తలు

Updated : 10/05/2020 16:27 IST

యాదాద్రి జిల్లాలో నలుగురికి పాజిటివ్

యాదాద్రి:  ఇప్పటి వరకూ ఎలాంటి పాజిటివ్‌ కేసులు నమోదు కాకుండా గ్రీన్‌ జోన్‌గా ఉన్న యాదాద్రి భువనగిరి జిల్లాలో కొత్తగా కరోనా కేసులు వెలుగు చూడటం కలకలం రేపింది. తాజాగా జిల్లాలో నలుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్‌ తెలిపారు.  ఆత్మకూరు(ఎం) మండలంలో 3 పాజిటివ్‌ కేసులు, సంస్థాన్‌ నారాయణపురంలో ఒక కేసు నమోదైనట్టు వెల్లడించారు. వీరంతా ముంబయి  నుంచి స్వగ్రామాలకు వచ్చిన వారేనని తెలిపారు. కరోనా సోకినవారి ప్రైమరీ కాంటాక్ట్‌లను గుర్తిస్తున్నట్టు కలెక్టర్‌ చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఏడు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని