close

తాజా వార్తలు

Published : 12/04/2021 16:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 5 PM

1. ఇదే చివరి హెచ్చరిక: కేటీఆర్‌

సీఎం కేసీఆర్‌ వయసు, హోదా చూడకుండా భాజపా నేతలు మాట్లాడుతున్నారని.. ఆయన్ను దూషిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఇదే చివరి హెచ్చరికని తేల్చి చెప్పారు. వరంగల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడారు. వరంగల్‌ నగరాభివృద్ధికి ఎన్నికోట్లు ఇచ్చామో శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు. తామిచ్చిన డబ్బుకు రెట్టింపు కేంద్రం నుంచి తీసుకురాగలరా? అని భాజపాను ప్రశ్నించారు. ఉగాదికి ఒకరోజు ముందే నగరానికి తాగునీరు అందించామని మంత్రి చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. బీఈడీ ప్రవేశ పరీక్ష అర్హతల్లో మార్పులు

తెలంగాణలో బీఈడీ ప్రవేశపరీక్ష అర్హతలు, ఇతర అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేసింది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి సిఫారసుల మేరకు బీఈడీ ప్రవేశపరీక్ష నిబంధనలను సవరించింది. బీబీఏ పట్టభద్రులు కూడా బీఈడీ చేసే అవకాశం కల్పించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి బీఏ, బీకాం, బీఎస్సీ, బీఎస్సీ హోంసైన్స్, బీసీఏ, బీబీఎం, బీఏ ఓరియెంటల్ లాంగ్వేజెస్‌తో పాటు బీబీఏ పట్టభద్రులు కూడా బీఈడీ ప్రవేశపరీక్ష రాయొచ్చు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

మహారాష్ట్రలో బోర్డు పరీక్షలు వాయిదా

3. ‘మోదీ జపం చేస్తున్న దీదీ’!

తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ నినాదమైన ‘మా, మాతి, మనుష్’ను మరిచిపోయిన మమతా బెనర్జీ.. ‘మోదీ’ జపం మొదలుపెట్టారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. బెంగాల్‌లో అధికారం కోల్పోయిన వామపక్షాలు మళ్లీ తిరిగి అధికారంలోకి రాలేరనే విషయం దీదీకి తెలుసని.. అదే పరిస్థితి ఆమెకు కూడా ఎదురవుతుందని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బర్దమాన్ నియోజకవర్గంలో పర్యటించిన మోదీ.. ఓటమి భయంతోనే మమతా బెనర్జీలో అసహనం పెరిగిందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. చైనా వెయ్యి ఇసుక రేణువుల వ్యూహం..!

చైనా స్టైలే వేరు.. ఏది చేసినా ఓపిగ్గా.. విభిన్నంగా చేస్తుంది. గూఢచర్యం కూడా అంతే.. అందుబాటులో ఉన్న ప్రతి వనరును  వినియోగిస్తుంది. అందుకే అమెరికా సీఐఏ వలేనో.. ఇజ్రాయెల్‌ మొస్సాద్‌ల తరహాలో చైనా గూఢచర్య సంస్థల పేర్లు బయట వినపడవు.. కానీ, చాపకింద నీరులాగా సమాచారం మాత్రం సరిహద్దులు దాటేస్తుంది. తాజాగా గ్రీకు పత్రిక పెంటాపోస్టాగ్మా చైనా గూఢచర్యంలోని ఓ భాగాన్ని వెలుగులోకి తెచ్చింది. చైనా ‘వెయ్యి ఇసుక రేణువులు’ (థౌజండ్‌ గ్రెయిన్స్‌ ఆఫ్‌ శాండ్‌) విధానంలో సమాచార సేకరణ చేస్తుందని వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. భారత్‌లో స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్‌కు అనుమతి

భారత్‌లో మరో వ్యాక్సిన్‌ వినియోగానికి అనుమతి లభించింది. రోజు రోజుకీ కరోనా కేసులు పెరుగుతుండటం, వివిధ రాష్ట్రాల్లో వ్యాక్సిన్‌ కొరత ఉండటంతో మరో ఐదు వ్యాక్సిన్లకు అనుమతి ఇవ్వాలని కేంద్రం భావించింది. ఇందులో భాగంగా రష్యా అభివృద్ధి చేసిన చేసిన ‘స్పుత్నిక్‌-వి’ వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగం కోసం కేంద్ర నిపుణుల కమిటీ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. త్వరలోనే టీకా ఉత్పత్తి చేసి, వినియోగంలోకి తీసుకురానున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

వారంలో.. 9లక్షల కరోనా కేసులు

6. అడివి శేష్‌ ‘మేజర్‌’ టీజర్‌ వచ్చేసింది!

థ్రిల్లర్‌ సినిమాల స్పెషలిస్టుగా పేరు తెచ్చుకున్న అడివి శేష్‌ మరోసారి సరికొత్త పాత్రలో అలరించేందుకు సిద్ధమయ్యారు. ఈసారి ‘మేజర్‌’గా మారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ముంబయి దాడుల్లో అమరుడైన మేజర్‌ సందీప్‌ ఉన్ని కృష్ణన్‌ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను డైరెక్టర్‌ శశికిరణ్‌ తెరకెక్కించారు. తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో జులై 2న విడుదల కానుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. కరోనా ఫియర్‌.. సూచీలు బేజార్‌

కరోనా భయాలు స్టాక్‌మార్కెట్లను కమ్మేశాయి. లాక్‌డౌన్‌ వార్తలతో సూచీలు బేజారయ్యాయి. ఒక్క రోజులో 3శాతానికి పైగా పతనమయ్యాయి. ఫలితంగా మదపర్ల లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరైంది. దేశంలో కరోనా కేసులు నానాటికీ పెరుగుతుండటం, మహారాష్ట్రలో బుధవారం నుంచి లాక్‌డౌన్‌ విధించనున్నట్లు వస్తున్న వార్తలతో దేశీయ మార్కెట్లు సోమవారం బేర్‌మన్నాయి. ట్రేడింగ్‌ ఆరంభమైన కొద్ది క్షణాల్లోనే భారీ నష్టాల్లో కూరుకుపోయాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. గుట్టలుగా వాడిన మాస్కులు..మహారాష్ట్రలో ఘోరం!

కరోనా కట్టడికి ప్రధాన ఆయుధమైన మాస్కును వాడిన వెంటనే మూత ఉన్న చెత్తడబ్బాలో వేయాలనేది నిపుణుల సూచన. అవన్నీ మాకెందుకు వాటితో కూడా మేం వ్యాపారం చేస్తామంటుంది ఓ పరుపుల తయారీ సంస్థ. అందుకే పరుపులను నింపేందుకు పత్తికి బదులు.. వాడిన మాస్కులను వినియోగిస్తోంది. మహారాష్ట్రలోని జల్‌గావ్ జిల్లాలో పారిశ్రామిక వాడలోని ఓ సంస్థ నిర్వాకమిది. ఈ వ్యవహారంపై సమాచారం అందుకున్న పోలీసులు సంస్థపై దాడి చేసి, యజమానిపై కేసు నమోదు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

అవసరమైతే లాక్‌డౌన్‌ విధిస్తాం!

9. ‘విరాట్‌’నౌకను తుక్కు చేయొచ్చు

మూడు దశాబ్దాల పాటు భారత నౌకాదళంలో సేవలందించిన విమాన వాహన నౌక ఐఎన్‌ఎస్‌ విరాట్‌ను తుక్కు చేసే ప్రక్రియను కొనసాగించొచ్చని సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది. ఈ నౌక విచ్ఛిన్న ప్రక్రియను ఆపాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. పిటిషనర్‌ చాలా ఆలస్యంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించారని కోర్టు అభిప్రాయపడింది. ఇప్పటికే నౌకలోని 40శాతాన్ని నిర్వీర్యం చేసినందున, ఇప్పుడు విచ్ఛిన్న ప్రక్రియలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. రషీద్‌ వస్తే రసెల్‌కు భయమా?

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తురుపు ముక్క.. రషీద్‌ ఖాన్‌. తన మిస్టరీ స్పిన్‌తో ఎంతో మంది బ్యాట్స్‌మన్లను ముప్పుతిప్పలు పెట్టాడు. జట్టుకు విజయాలు అందించాడు. అందుకే అలవోకగా పరుగులు చేసే ఎంతటి బ్యాట్స్‌మన్‌ అయినా అతడికి భయపడుతుంటారు. ఆచితూచి ఆడతారు. వెస్టిండీస్‌ విధ్వంసకర వీరుడు, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఆటగాడు ఆండ్రీ రసెల్‌ సైతం అదే కోవలోకి వస్తాడు. రషీద్‌ బౌలింగ్‌లో రసెల్‌కు మెరుగైన రికార్డు లేదు. సిక్సర్లు బాదకుండా ఎవరినీ వదిలిపెట్టని అతడు ఈ అఫ్గాన్‌ వీరుడు వస్తే మాత్రం వణికిపోతాడు! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని