తులిప్‌ అందాలు.. పర్యాటకుల ఆనందాలు

తాజా వార్తలు

Published : 17/04/2021 01:49 IST

తులిప్‌ అందాలు.. పర్యాటకుల ఆనందాలు

లాంక్‌షైర్‌: బ్రిటన్‌లోని తులిప్‌ ఉద్యానవనాలు ప్రకృతి ప్రేమికులకు ఆహ్వానం పలుకుతున్నాయి. లాంక్‌షైర్‌లోని పలు ఉద్యానవనాలు రంగురంగుల పుష్పాలతో కనువిందు చేస్తున్నాయి. తులిప్‌ పుష్ప పరిశ్రమకు కేంద్రంగా ఉన్న లాంక్‌షైర్‌లో వార్షిక వేడుకలు ప్రారంభం కావడంతో వీటిని చూసేందుకు సందర్శకులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. ఉద్యానవనాల్లో తిరుగుతూ పూల సుమగంధాలను ఆస్వాదిస్తున్నారు.

80 వేల పూల మొక్కలతో స్ప్రింగ్‌ఫీల్డ్‌ ఉద్యానవనం సందర్శకులకు కనువిందు చేస్తోంది. ఈ పూల వనంలో దాదాపు 80 రకాల పూల మొక్కలు ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఏటా అక్టోబర్‌, నవంబర్‌ మధ్య తులిప్‌ మొక్కలను నాటుతారు. మార్చి నాటికి ఇవి పుష్పించడం ప్రారంభిస్తాయి. అయితే ఈ ఏడాది తులిప్‌ పూలు సీజన్‌ కంటే ముందుగానే పూశాయి. దాదాపు 60 శాతం రేకులు విప్పుకొన్నాయి. వచ్చే నెల వరకు అన్ని పూలు వికసిస్తాయని నిర్వాహకులు పేర్కొన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని