close
Array ( ) 1

తాజా వార్తలు

కివీస్‌తో సెమీస్‌లో రన్నౌట్‌పై ధోనీ ఏమన్నాడంటే?

కోట్లాది మంది ఆశల్ని చిదిమేసిన ఆ రన్నౌట్‌ పై..

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమిండియా గతేడాది ఇంగ్లాండ్‌ జరిగిన వన్డే ప్రపంచకప్‌లో సెమీస్‌ నుంచే నిష్క్రమించిన సంగతి తెలిసిందే. టైటిల్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగి టోర్నీ ఆసాంతం వరుస విజయాలతో దూసుకుపోయిన భారత్‌ కివీస్‌తో సెమీఫైనల్లో 18 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. న్యూజిలాండ్‌ నిర్దేశించిన 240 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్‌ 221 పరుగులకు ఆలౌటైంది. ఒక స్థితిలో 92/6 నిలిచిన జట్టును రవీంద్ర జడేజా(77), ధోనీ(50) ఆదుకున్నారు. ఏడో వికెట్‌కు 116 పరుగులు జోడించి విజయంపై ఆసక్తి రేపారు. ఈ క్రమంలో జడేజా ఔటయ్యాడు.

జడ్డూ ఔటైనా కోట్లాది మంది భారతీయుల ఆశలన్నీ ధోనీపైనే ఉన్నాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మాజీ సారథి ఎన్నోసార్లు ఒంటి చేత్తో మ్యాచ్‌లు గెలిపించాడు. కాగా, చివరి రెండు ఓవర్లలో భారత్‌కు 31 పరుగులు అవసరమైన స్థితిలో ధోనీ క్రీజులో ఉన్నాడు. లాకీ ఫెర్గుసన్‌ వేసిన 49వ ఓవర్‌లో ధోనీ తొలి బంతిని సిక్స్‌గా మలిచాడు. తర్వాతి బంతికి పరుగులు రాలేదు. దీంతో ఒత్తిడికి గురైన ధోనీ మూడో బంతికి రెండు పరుగులు తీద్దామని భావించాడు. అయితే, మార్టిన్‌ గప్తిల్‌ విసిరిన అనూహ్య త్రోకు ధోనీ రనౌట్‌ అయ్యాను. దీంతో భారత్‌ 221 పరుగులకు ఆలౌటైంది. 

ఈ విషయంపై ధోనీ తాజాగా ఒక మీడియాతో మాట్లాడుతూ బాధపడ్డాడు. ‘నేనాడిన తొలి మ్యాచ్‌లో రనౌట్‌ అయ్యాను. తర్వాత మళ్లీ ఈ మ్యాచ్‌లో అలానే ఔటయ్యా. ఈ రెండు విషయాలపై నేనెప్పుడూ బాధపడుతుంటా. ఎందుకు డైవ్‌ చేయలేకపోయా? అని ప్రశ్నించుకుంటా. ఇప్పటికీ ఆ రెండు ఇంచులను డైవ్‌ చేయాల్సిందని అనుకుంటా’ అని ధోనీ స్పందించాడు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.