close

తాజా వార్తలు

Updated : 19/05/2020 21:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తెలంగాణలో మరో 42 కరోనా కేసులు

హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా మరో 42 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. దీందో రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 1,634కి చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 34 కేసులు నమోదవగా.. మరో 8 మంది వలస కార్మికులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో ఇప్పటివరకు కరోనా సోకిన వలస కూలీల సంఖ్య 77కి చేరింది. ఇవాళ కరోనా మహమ్మారి నుంచి కోలుకుని 9 మంది డిశ్చార్జ్‌ కాగా.. కోలుకున్న వారి సంఖ్య 1,011కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో 38 మంది ప్రాణాలు కోల్పోగా.. 585 మంది చికిత్స పొందుతున్నారు.

ఇప్పటివరకు రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో ఒక్క కరోనా కేసూ నమోదు కాలేదని ఆరోగ్య శాఖ తెలిపింది. అంతేకాకుండా గత 14 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా 25 జిల్లాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన