close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 12/05/2020 16:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

భారీ పతనాల నుంచి..

ముంబయి: దేశీయ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌190 పాయింట్లు నష్టపోయి 31,371 వద్ద ముగియగా, నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నిఫ్టీ 42 పాయింట్ల నష్టంతో 9,196 వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.75.50 వద్ద కొనసాగుతోంది.

అంతర్జాతీయ ప్రతికూలతల నేపథ్యంలో మంగళవారం ఉదయం స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 602 పాయింట్లు కోల్పోయి 30,965కు పడిపోయింది. నిఫ్టీ 167 పాయింట్లు దిగజారి 9,070 వద్ద ట్రేడింగ్‌ను కొసాగించింది. మార్చిలో ఐదు నెలల కనిష్ఠానికి పడిపోయిన రిటైల్‌ ఆధారిత ద్రవ్యోల్బణ సూచీ(సీపీఐ).. ఏప్రిల్‌ వివరాలు నేడు విడుదల కానుండటం, దేశంలో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య 70వేల మార్క్‌ దాటడం మదుపర్ల సెంటిమెంటును దెబ్బతీసింది. అయితే, రాత్రి 8గంటలకు ప్రధాని నరేంద్రమోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తారన్న ప్రకటన వెలువడటంతో మదుపరులు ఊపిరి పీల్చుకున్నారు. భయపడుతూనే కొనుగోళ్లకు మొగ్గు చూపారు. దీంతో ఇంట్రాడే కనిష్ఠాల నుంచి సూచీలు నెమ్మదిగా కోలుకున్నాయి. అయినా చివరకు నష్టాల్లోనే ముగిశాయి.

మంగళవారం నాటి ట్రేడింగ్‌లో వేదంతా, ఎన్టీపీసీ, భారతీ ఎయిర్‌టెల్‌, ఐటీసీ, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌ తదితర షేర్లు లాభపడగా, రిలయన్స్‌, గెయిల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, సిప్లా, కొటక్‌ మహీంద్రా తదితర షేర్లు నష్టాలను చవిచూశాయి.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.