టిక్‌టాక్‌లానే.. త్వరలో యూట్యూబ్‌ షార్ట్స్‌
close

తాజా వార్తలు

Updated : 21/09/2020 13:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టిక్‌టాక్‌లానే.. త్వరలో యూట్యూబ్‌ షార్ట్స్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: సరిహద్దుల్లో చైనాతో నెలకొన్న ఉద్రిక్తల దృష్ట్యా ఆ దేశానికి చెందిన యాప్‌లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. వీటిలో పబ్‌జీ, టిక్‌టాక్‌ సహా ఇతర యాప్‌లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పలు కంపెనీలు టిక్‌టాక్‌ ప్రత్యామ్నాయలను తీసుకొస్తున్నాయి. తాజాగా వీడియో స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫాం యుట్యూబ్ ‘షార్ట్స్‌’ పేరుతో కొత్త ఫీచర్‌ను ప్రారంభించనుంది. త్వరలోనే ఈ ఫీచర్‌ని భారత్‌లో పరీక్షించనున్నారు. రాబోయే రోజుల్లో దీన్ని మరిన్ని దేశాలకు విస్తరించనున్నట్లు యుట్యూబ్‌ తన బ్లాగ్‌లో వెల్లడించింది. అయితే షార్ట్స్‌ను ప్రత్యేక యాప్‌గా తీసుకురావడం లేదు. యుట్యూబ్‌ యాప్‌లోనే దీన్ని హైలైట్‌ చేస్తూ ఒక సెక్షన్‌ ఉంటుంది. ప్రస్తుతానికి ఇది ఆండ్రాయిడ్ యూజర్స్‌కి మాత్రమే అందుబాటులోకి రానుంది. త్వరలోనే ఐఓఎస్‌ యూజర్స్‌కి పరిచయం చేస్తామని యుట్యూబ్‌ తెలిపింది.  

టిక్‌టాక్‌ మాదిరిగానే యూట్యూబ్ షార్ట్స్‌లో యూజర్స్‌ 15 సెకన్లు లేదా అంతకు తక్కువ నిడివి ఉన్న వీడియోలను రూపొందించవచ్చు. ముందుగా వీడియో రికార్డ్‌ చేసి దానికి స్పెషల్ ఎఫెక్ట్స్‌, మ్యూజిక్‌ లైబ్రరీలో ఉన్న సౌండ్‌ ట్రాక్‌లు యాడ్‌ చేసుకోవచ్చు. ఇందులో వీడియో స్పీడ్ కంట్రోల్‌, సులభంగా రికార్డ్‌ చేసేందుకు టైమర్‌ అండ్ కౌంట్‌డౌన్‌, మల్టీ సెగ్మెంట్ కెమెరా వంటి ఫీచర్స్‌ ఉన్నాయి. మల్టీ సెగ్మెంట్ కెమెరాలో యూజర్స్‌ వివిధ రకాల వీడియోలను ఒక చోటికి చేర్చుకోవచ్చు. ముందుగా షార్ట్స్‌ బీటా వెర్షన్‌ని భారత్‌లోని వీడియో క్రియేటర్స్‌, ఆర్టిస్ట్‌లతో కలిసి పరీక్షించనున్నట్లు యూట్యూబ్‌ తెలిపింది. రాబోయే రోజుల్లో మరిన్ని ఫీచర్స్‌ యాడ్‌ చేసి యూజర్స్‌కి మరింత చేరువకావాలని యూట్యూబ్‌ భావిస్తోంది.  


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని