ఆసుపత్రి సిబ్బంది ఏ మాత్రం పట్టించుకోలేదు!
close

తాజా వార్తలు

Published : 23/09/2020 01:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆసుపత్రి సిబ్బంది ఏ మాత్రం పట్టించుకోలేదు!

తాతయ్య తీవ్ర అనారోగ్యంతో బాధపడ్డారు: నటి

ముంబయి: బాలీవుడ్‌ నటి జరీన్‌ ఖాన్‌ ముంబయి లీలావతి ఆసుపత్రి తీరుపై అసహనం వ్యక్తం చేశారు. అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లిన తన 87 ఏళ్ల తాతయ్యను పట్టించుకునే వారు లేరంటూ సోషల్‌మీడియాలో ఆవేదన వ్యక్తం చేశారు. ‘లాక్‌డౌన్‌ ప్రారంభమైనప్పటి నుంచి మా తాతయ్య ఇంట్లోనే ఉన్నారు. కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్యం ఏ మాత్రం బాగోలేదు. సోమవారం రాత్రి ఆసుపత్రికి తీసుకెళ్లాం. లోపలికి వెళ్లడానికి ముందే ఆక్సిజన్‌ స్థాయి, శరీర ఉష్ణోగ్రతను పరిశీలించారు. అంతా సాధారణంగానే ఉంది. అయినా సరే.. ఆయన్ను పట్టించుకోకుండా, చాలా సమయం ఎదురుచూసేలా చేశారు. ఆ తర్వాత కరోనాతోపాటు పలు పరీక్షలు చేయించుకోవాలంటూ చికిత్సను వాయిదా వేశారు. సిబ్బంది నాతో కూడా దురుసుగా ప్రవర్తించింది. తాతయ్య గురించి నేను చెప్పే మాటలు కూడా వినలేదు’.

‘ఇలాంటి సమయంలో ఆసుపత్రులకు వెళ్లొద్దని నా స్నేహితులు ఇటీవల చెప్పారు. ఈ కరోనా సమయాన్ని బిజినెస్‌ చేసుకుంటున్నారని చాలా మంది అన్నారు. కానీ ఇప్పుడు చూశా. మనం వైద్యులు కొవిడ్‌-19తో పోరాడుతున్నారని చెప్పుకుంటున్నాం. కానీ మన పరిస్థితిని వాళ్లు అర్థం చేసుకుని, చికిత్స చేయడం లేదు. వారి అవసరం మనకు ఉండగా.. ఇలా ప్రవర్తిస్తున్నారు’ అని జరీన్‌ ఏడు నిమిషాల వీడియోలో మాట్లాడారు. చివరికి తాతయ్య పరిస్థితి చూసి భయపడి ఇంటికి తీసుకొచ్చినట్లు చెప్పారు. తనే మందులు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పుడు తన తాతయ్య ఆరోగ్య పరిస్థితి బాగుందని హిందీలో వివరించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని