AP Corona: రాష్ట్ర ప్రభుత్వ చర్యలపై హైకోర్టు అసంతృప్తి
close

తాజా వార్తలు

Updated : 06/05/2021 16:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

AP Corona: రాష్ట్ర ప్రభుత్వ చర్యలపై హైకోర్టు అసంతృప్తి

అమరావతి: కొవిడ్‌ నియంత్రణకు ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది. రాష్ట్రంలో ఆక్సిజన్‌ కొరత లేదని మొన్న అఫిడవిట్‌లో పేర్కొన్నారని.. ఇప్పుడు ఆక్సిజన్‌ బెడ్లు ఖాళీ లేవని నోడల్‌ అధికారులే చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ అఫిడవిట్‌లో లెక్కలకు, వాస్తవ పరిస్థితికి పొంతన లేదని ఆక్షేపించింది. కరోనా చికిత్సలు సక్రమంగా అందడం లేదంటూ సామాజిక కార్యకర్త తోట సురేశ్‌బాబు, ఏపీసీఎల్‌ఏ వేసిన పిల్‌పై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది.

కరోనా నియంత్రణకు రాష్ట్ర సర్కారు తీసుకున్న చర్యలను ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు వివరించగా.. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని అమికస్‌క్యూరీ తెలిపారు. పడకల లభ్యత, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఫీజుల వసూలు అంశాలపై హైకోర్టు విచారణ కొనసాగిస్తోంది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని