close

తాజా వార్తలు

Published : 26/02/2020 13:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నాగ్‌ అశ్విన్‌ డైరెక్షన్‌లో ప్రభాస్‌ కొత్త సినిమా

ప్రకటించిన వైజయంతి మూవీస్‌

హైదరాబాద్‌: యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ అభిమానులకు సర్‌ప్రైజ్‌ వచ్చేసింది. ఆయన కథానాయకుడిగా నాగ్‌ అశ్విన్‌ డైరెక్షన్‌లో ఓ సినిమా రూపొందనుంది. ప్రముఖ నిర్మాణ  సంస్థ వైజయంతి మూవీస్‌ పతాకంపై తెరకెక్కనున్న ఈ సినిమా త్వరలో పట్టాలెక్కనుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ వైజయంతి మూవీస్‌ ట్విటర్‌ వేదికగా ఓ స్పెషల్‌ వీడియోను అభిమానులతో పంచుకుంది. ‘నాగ్‌ అశ్విన్‌ డైరెక్షన్‌లో మేమెంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా కోసం ప్రభాస్‌తో కలిసి పనిచేయడం మాకెంతో గౌరవంగా ఉంది’ అని చిత్ర నిర్మాణ సంస్థ పేర్కొంది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ప్రస్తుతం ప్రభాస్‌.. రాధాకృష్ణ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఓ సినిమాలో నటిస్తున్నారు. వింటేజ్ ప్రేమ కథగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్‌కు జంటగా పూజాహెగ్డే నటిస్తున్నారు. ‘జాన్‌’ అనే టైటిల్‌ ప్రచారంలో ఉంది. కృష్ణంరాజు కీలకపాత్రలో కనిపించనున్నారు.



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.