పోలీసులు ప్రజల మెప్పు పొందారు: హోంమంత్రి
close

తాజా వార్తలు

Updated : 13/07/2020 22:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పోలీసులు ప్రజల మెప్పు పొందారు: హోంమంత్రి

హైదరాబాద్‌: పోలీసు శాఖలో కరోనా పరిస్థితిపై తెలంగాణ హోం శాఖమంత్రి మహమ్మద్ అలీ సమీక్ష నిర్వహించారు. వైరస్ బారినపడిన పోలీసుల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీసు సిబ్బందికి మనోధైర్యం కలిగేలా అధికారులు ప్రోత్సహించాలని హోం మంత్రి సూచించారు. ప్రజలను అప్రమత్తం చేయడంలో పోలీసులు చేస్తున్న కృషిని మహమ్మద్‌ అలీ అభినందించారు. కరోనా వ్యాప్తి నివారణలో పోలీసులు ముందువరుసలో ఉండి ప్రజల మెప్పు పొందారని హోం మంత్రి ప్రశంసించారు. కరోనాకు భయపడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. తాను కూడా వైరస్ బారినపడి కోలుకున్నానని మహమ్మద్‌ అలీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని