close

తాజా వార్తలు

Updated : 19/01/2021 05:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నీ ప్రదర్శనతో గెలుపు ఆశలు పెంచావు: కేటీఆర్‌

హైదరాబాద్‌: హైదరాబాదీ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ ప్రదర్శనపై తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ ప్రశంసలు కురిపించారు. ‘తండ్రిని కోల్పోయిన విషాద సమయంలో కూడా మహ్మద్‌ సిరాజ్‌ అద్భుత ప్రదర్శన చేశాడు. నీ ఉత్తమ ప్రదర్శనతో భారత్‌ సిరీస్‌ గెలిచేందుకు ఆశలు కల్పించావు. దివినున్న మీనాన్న కచ్చితంగా గర్విస్తాడు’ అని కేటీఆర్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. 

బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నిర్ణయాత్మక నాలుగో టెస్టులో తన కేరీర్‌లోనే సిరాజ్‌ అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసి ఆ జట్టును దెబ్బతీశాడు. దీంతో ఆస్ట్రేలియా 294 పరుగులకే ఆలౌటైంది. అనంతరం 328 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ వర్షం కారణంగా ఆట ఆగిపోయే సమయానికి 4/0తో నిలిచింది. ఓపెనర్లు రోహిత్‌ (4 బ్యాటింగ్‌), శుభ్‌మన్‌ గిల్‌ (0 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు.

ఇవీ చదవండి
ఆ ఓటమి కన్నా ఈ డ్రా మరింత ఘోరం
ఆఖరి రోజు ఆసీస్‌కు భయం.. ఎందుకంటే!




Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని