
తాజా వార్తలు
ఇస్లామాబాద్: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రం సియాచిన్‌పై పాకిస్థాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. సియాచిన్ అనేది వివాదాస్పద ప్రాంతమని, అందులో భారత్ పర్యాటకుల సందర్శనల కోసం తెరవకూడదని పాకిస్థాన్ పేర్కొంది. సియాచిన్‌లో భారత్ పర్యాటకాన్ని చేపట్టడంపై మీడియా అడిగిన ప్రశ్నకు పాకిస్థాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ముహమ్మద్ ఫైజల్ స్పందిస్తూ.. ‘ అది వివాదాస్పద ప్రాంతం. అలాంటి ప్రాంతంలో భారత్ పర్యాటకాన్ని ఎలా ప్రారంభిస్తుంది. అయినప్పటికీ ఈ విషయంలో తాము భారత్ నుంచి ఎలాంటి మంచిని ఆశించడం లేదు’ అని వెల్లడించారు. .
ఇటీవల భారత ప్రభుత్వం సియాచిన్ ప్రాంతంలో పర్యాటకుల సందర్శనలను అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా సియాచిన్ బేస్ క్యాంప్ నుంచి కుమార్ పోస్ట్ వరకు పర్యాటకులు వెళ్లేందుకు అనుమతించింది. ఈ మేరకు అక్టోబర్ 21న పర్యాటకులకు అనుమతినిచ్చే కార్యక్రమాన్ని రక్షణ శాఖామంత్రి రాజ్‌నాథ్ సింగ్, సైనికాధిపతి బిపిన్ రావత్‌తో కలిసి ప్రారంభించారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఒకే గదిలో అవివాహిత జంట ఉండటం నేరం కాదు
- ఎన్‌కౌంటర్‌పై సీపీఐ నారాయణ క్షమాపణ
- విచారణ ‘దిశ’గా...
- ఎమ్మెల్యే ఆనం వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం
- ఘోర అగ్ని ప్రమాదం..43 మంది మృతి
- ‘అక్క’ కోసం వచ్చింది అక్కడే చితికిపోయింది!
- అంతా అయ్యాక ఎందుకు వచ్చారు?
- కొడితే.. సిరీస్ పడాలి
- పెళ్లే సర్వం, స్వర్గం
- దిశ తల్లిదండ్రులకు ఎన్హెచ్ఆర్సీ పిలుపు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
