close

తాజా వార్తలు

ఉన్నావ్‌ కేసు: ఎమ్మెల్యేనే దోషి

దిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్‌ అత్యాచార కేసులో దిల్లీలోని తీస్‌హజారీ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న భాజపా నుంచి బహిష్కరణకు గురైన ఎమ్మెల్యే కుల్‌దీప్‌ సింగ్‌ సెంగార్‌ను దోషిగా నిర్ధారిస్తూ న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. బుధవారం సెంగార్‌కు శిక్ష ఖరారు చేయనున్నారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో నిందితుడు శశి సింగ్‌ను నిర్దోషిగా తేల్చింది. సెంగార్‌ పలుకుబడి ఉన్న వ్యక్తి కావడం.. బాధితురాలు నగరానికి చెందిన వ్యక్తి కాకుండా ఓ గ్రామస్థురాలు కావడంతో కేసును ఫైల్‌ చేసే విషయంలో అలసత్వం ప్రదర్శించారని కోర్టు వ్యాఖ్యానించింది. దోషికి జీవితఖైదు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

ఈ కేసు విచారణ విషయంలో ప్రతీ చోటా నిర్లక్ష్యం జరిగినట్లు స్పష్టమవుతోందని కోర్టు వ్యాఖ్యానించింది. బాధితురాలిని, కుటుంబసభ్యులను నిందితులు బెదిరిస్తుంటే పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహించారని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి రాజకీయనాయకుడు కావడం వల్ల అతడికి అనుకూలంగా వ్యవహరించారని, బాధితురాలు ఫిర్యాదు చేసినపుడు పట్టించుకోలేదని న్యాయస్థానం పేర్కొంది. తనకు న్యాయం చెయ్యాలని కోరుతూ లఖ్‌నవూలో సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఇంటి ముందు ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడటంతో అప్పుడు కేసు నమోదు చేయడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 

2017లో మైనర్‌ బాలికపై ఉన్నావ్‌లో అత్యాచార ఘటన చోటుచేసుకుంది. ఈ కేసులో ఉత్తరప్రదేశ్‌లోని బంగేర్‌మౌ నుంచి నాలుగు సార్లు భాజపా ఎమ్మెల్యేగా గెలుపొందిన కుల్‌దీప్‌ సెంగార్‌ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసు కారణంగా ఆ పార్టీ ఈ ఏడాది ఆగస్టులో అతడిని బహిష్కరించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు లఖ్‌నవూ నుంచి దిల్లీ కోర్టుకు ఈ కేసు బదిలీ అయిన అనంతరం జిల్లా న్యాయమూర్తి ధర్మేశ్‌ శర్మ రోజువారీ విచారణ చేపట్టారు. ఈ కేసు విచారణ నిమిత్తం బాధితురాలు, ఆమె తరఫు బందువులు రాయబరేలికి వెళ్తుండగా వారి కారును ట్రక్‌ ఢీకొంది. ఆ ఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందగా, బాధితురాలు, న్యాయవాది తీవ్రంగా గాయపడ్డారు. ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి బాధితురాలిని హత్య చేయించేందుకు కుట్ర పన్నినట్లు సెంగార్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బాధితురాలి హత్యకు సెంగార్‌ కుట్రపన్నుతున్నారనే ఆరోపణలపై సీబీఐ విచారణ జరుపుతోంది.

తీర్పు వెలువడగానే ఏడ్చిన సెంగార్‌..

ఉన్నావ్‌ అత్యాచారఘటనలో కోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే సెంగార్‌ కన్నీళ్లు పెట్టుకున్నారు. తన సోదరి పక్కన నిలుచొని ఏడుస్తూ కనిపించారు.  

 



Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.