కేరళ విమాన ప్రమాదం: తొలి 5 నిమిషాల్లో ఏం జరిగిందంటే 

తాజా వార్తలు

Published : 11/08/2020 02:20 IST

కేరళ విమాన ప్రమాదం: తొలి 5 నిమిషాల్లో ఏం జరిగిందంటే 

కొలికోడ్‌: కేరళలోని కొలికోడ్‌లో జరిగిన విమాన ప్రమాదం ఇప్పటి వరకు 19 మందిని పొట్టన పెట్టుకుంది. శుక్రవారం ఐఎక్స్‌ 1355 ఎయిర్‌ ఇండియా విమానం ఇక్కడి టేబుల్ టాప్‌ రన్‌వేపై ల్యాండ్‌ అవుతున్న సమయంలో అదుపు తప్పటంతో ఈ దుర్ఘటన సంభవించింది. వందేభారత్‌ మిషన్‌లో భాగంగా దుబాయి నుంచి భారత్‌కు వచ్చిన ప్రవాస భారతీయులు.. మరికొద్ది సేపట్లో తమ స్వస్థలాలకు చేరుతారనగా జరిగిన ఈ దుర్ఘటన దేశం మొత్తాన్ని కలవరపరచింది. కాగా, అంతవరకు సాఫీగా సాగిన ప్రయాణం చివరిలో ఏమైందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రమాదం జరిగిన తొలి ఐదు నిమిషాల్లో ఏం జరిగిందనే అంశానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి...

*రాత్రి 7:40 గంటలు: భారీ వర్షం కురుస్తుండటంతో ఎయిరిండియా బోయింగ్‌ విమానం, టేబుల్‌ టాప్‌ రన్‌వేపై అదుపుతప్పి 35 అడుగుల లోయలోకి పడిపోయింది. దీనిని గమనించిన సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది ఒకరు ఈ సమాచారాన్ని వెంటనే అధికారులకు అందించారు.
రాత్రి 7:41 గంటలు: సీఐఎస్‌ఎఫ్‌ కంట్రోల్‌ రూం నుంచి సీఐఎస్‌ఎఫ్‌ క్విక్‌ రెస్పాన్స్‌ టీంకు, ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌కు సమాచారం అందింది.
రాత్రి 7:42 గంటలు: విమానాశ్రయ అగ్నిమాపక దళానికి సమాచారం అందటంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు.
*రాత్రి 7:43 గంటలు: సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది ఘటనను గురించి విమానాశ్రయ వైద్య విభాగానికి సమాచారమిచ్చారు.
*రాత్రి 7:44 గంటలు: సీఐఎస్‌ఎఫ్‌ కంట్రోల్‌ రూం అధికారులు విమానాశ్రయ డైరెక్టర్‌, టెర్మినల్‌ అధికారితో సంప్రదింపులు జరిపారు.
*రాత్రి 7:45 గంటలు: సీఐఎస్‌ఎఫ్‌ కంట్రోల్‌ రూం నుంచి స్థానిక పోలీసులకు సమాచారం చేరింది.
*ఈలోగా కొంతమంది స్థానికులు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. విమాన ప్రయాణికుల సంఖ్య అధికంగా ఉండటంతో.. స్థానికులు సహాయ కార్యక్రమాల్లో పాలుపంచుకుకేందుకు విమానాశ్రయ ఉన్నతాధికారులు అనుమతినిచ్చారు. సమయానుగుణమైన ఈ నిర్ణయం, అధిక నష్టం సంభవించకుండా దోహదపడింది.

కాగా, మే 22, 2010న మంగుళూరులో ఇదే విధంగా జరిగిన ప్రమాదంలో 158 మంది మృతిచెందారు. కొలికోడ్‌ ఘటనలో విమానానికి నిప్పు అంటుకోకపోవటంతో పెనుప్రమాదం తప్పిందని నిపుణులు విశ్లేషించారు. అనుభవజ్ఞుడైన పైలట్‌ దీపక్‌ సాథె సమయస్ఫూర్తి వల్లే ఇది సంభవించిందని వారు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని