Lakhimpur Kheri violence: నా కొడుకు అక్కడ ఉన్నాడని రుజువు చేస్తే.. రాజీనామా చేస్తా!

తాజా వార్తలు

Published : 05/10/2021 14:20 IST

Lakhimpur Kheri violence: నా కొడుకు అక్కడ ఉన్నాడని రుజువు చేస్తే.. రాజీనామా చేస్తా!

కేంద్రమంత్రి అజయ్‌ మిశ్రా 

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌లోని లఖింపుర్‌ ఖేరిలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలకు సంబంధించి తన కుమారుడిపై వస్తోన్న హత్య ఆరోపణలను కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్‌ మిశ్రా మరోసారి ఖండించారు. ఘటన జరిగిన సమయంలో తన కొడుకు ఆశిష్‌ అక్కడ లేడని అన్నారు. ఒకవేళ తన కుమారుడు ఘటనాస్థలంలోనే ఉన్నాడని రుజువు చేస్తే తన పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు.

 ‘‘ఉద్రిక్తతలు జరిగిన సమయంలో ఆశిష్‌ అక్కడ లేడు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లాడు. అందుకు సంబంధించిన వీడియో, ఫొటో సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఒకవేళ ఆశిష్‌ లఖింపుర్‌ ఖేరిలోనే ఉన్నాడని రుజువు చేస్తే నేను నా పదవికి రాజీనామా చేస్తా’’ అని మిశ్రా చెప్పుకొచ్చారు. అయితే మిశ్రా వ్యాఖ్యలను రైతులు ఖండిస్తున్నారు. మంత్రి కుమారుడు ఆశిష్‌ స్వయంగా తుపాకీతో బెదిరించినట్టు కొందరు ఆరోపించారు.

ఉత్తర్‌ప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య పర్యటన నేపథ్యంలో, ఆదివారం లఖింపుర్‌ ఖేరీలో హింస చెలరేగిన సంగతి తెలిసిందే. నూతన వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ అక్కడి తికోనియా-బన్బీర్‌పుర్‌ రహదారిపై అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తుండగా.. వారిపైకి ఓ కారు దూసుకెళ్లింది. దీంతో ఆగ్రహానికి గురైన అన్నదాతలు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఓ విలేకరి సహా 9 మంది మరణించారు. అయితే అది కేంద్రమంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు ఆశిష్‌ కారేనని, అందులో ఆశిష్‌ కూడా ఉన్నారని రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని