అప్పుడే..పిచాయ్ చివరిసారి కంటతడి పెట్టారు..!

తాజా వార్తలు

Published : 13/07/2021 23:02 IST

అప్పుడే..పిచాయ్ చివరిసారి కంటతడి పెట్టారు..!

వాషింగ్టన్: పరిచయం అక్కర్లేని టెక్‌ దిగ్గజం గూగుల్‌కు ఆయన సీఈఓ. భారీ వేతనం. తీరికలేని పనులు. కానీ ఆయన్ను కూడా ఈ మధ్యకాలంలో ఎదురైన కొన్ని పరిస్థితులు కన్నీరు పెట్టించాయట. ఆయన సుందర్ పిచాయ్‌ అని మీకు ఈపాటికే అర్థమై ఉంటుంది. ఇంతకీ ఆ పరిస్థితులేంటో బీబీసీ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. 

మీరు చివరిసారిగా ఎప్పుడు కంటతడి పెట్టుకున్నారని సుందర్‌ పిచాయ్‌ను ప్రశ్నించగా.. ‘కరోనా తీవ్రత అధికంగా ఉన్న సమయంలో మార్చురీల ఎదుట మృతదేహాలతో నిండిన ట్రక్కులను చూసి తీవ్ర వేదనకు గురయ్యా. ఇటీవల కాలంలో భారత్‌ ఎదుర్కొన్న దయనీయ పరిస్థితులు కన్నీరు పెట్టించాయి’ అంటూ ఆయన ఉద్వేగంగా వెల్లడించారు. 

గత ఏడాదిన్నర కాలంగా ప్రపంచ దేశాల్లో కరోనా కల్లోలం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 40 లక్షల మందికి పైగా ఈ మహమ్మారికి బలయ్యారు. అలాగే కరోనా రెండో దఫా విజృంభణ భారత్‌ను కుదిపేసింది. ఏప్రిల్‌-మే నెలల్లో రికార్డు స్థాయి కేసులు, మరణాలు వెలుగుచూశాయి. అత్యవసరంలో వైద్యసహాయం అందక ఆసుపత్రి ముందే కొవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఎన్నో. మార్చురీలు నిండిపోయి..అంత్యక్రియలు నిర్వహించేందుకు వీలులేక పలుప్రాంతాల్లో మృత్యుఘోష వినిపించింది. 

ఇదిలా ఉండగా.. ఇదే ఇంటర్వ్యూలో పిచాయ్ పలు అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఇంటర్నెట్ పలు దేశాల్లో దాడికి గురవుతోందన్నారు. బలమైన ప్రజాస్వామ్య మూలాలున్న దేశాలు అంతర్జాల విచ్ఛిన్నతకు వ్యతిరేకంగా నిలబడాలని పిలుపునిచ్చారు. అలాగే తాను అమెరికా పౌరుణ్ని అయినా.. తనలో భారతీయ మూలాలు బలంగా పెనవేసుకుని ఉన్నాయని పుట్టిన గడ్డపై అభిమానాన్ని చాటుకున్నారు పిచాయ్. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని