
తాజా వార్తలు
బర్మింగ్‌హామ్: ప్రపంచకప్ సెమీస్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాకు పరాభవం తప్పదని ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ ప్లంకెట్ అన్నాడు. తమ జట్టు నిండా మ్యాచ్ విన్నర్లే ఉన్నారని, దీంతో సెమీస్‌లోనే ఢిపెండింగ్ ఛాంపియన్ ఇంటిముఖం పట్టక తప్పదని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా ప్లంకెట్ మాట్లాడుతూ..‘ఇంతకుముందు ప్రపంచకప్‌ల్లో ఆడిన ఇంగ్లాండ్ జట్లతో పోల్చుకుంటే ప్రస్తుత జట్టు పూర్తి భిన్నంగా ఉంది. గత నాలుగేళ్లుగా మేము అద్భుత ప్రదర్శనతో ముందుకు సాగుతున్నాం. దాని ఫలితమే మా జట్టుకు వన్డేల్లో అగ్రస్థానం. తర్వాతి మ్యాచ్‌లోనూ ఇదే జోరు కొనసాగిస్తే మా ఖాతాలో మరో విజయం వచ్చి చేరినట్టే. మా కంటూ ఓ రోజు వస్తే ప్రపంచంలో ఎలాంటి జట్టునైనా ఓడించగలం.’ అని చెప్పుకొచ్చాడు.
వన్డే ఫార్మాట్‌కు తగ్గట్టుగానే మా జట్టును పునరుద్ధరించుకున్నాం. జట్టులో ఆటగాళ్లందరూ ఫుల్ ఫామ్‌లో ఉండటం కూడా బాగా కలిసొచ్చే అంశమని చెప్పాడు. ప్రస్తుత ప్రపంచకప్పే బాహుశా తనకు చివరి టోర్నీ కావొచ్చని, 2023లో ఆడే అవకాశాలు దాదాపు లేనట్లేనని ప్లంకెట్ అన్నాడు. ఈ టోర్నీలో 5 మ్యాచ్‌లాడిన అతను 8 వికెట్లు పడగొట్టాడు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- అస్థీకరణ పరీక్షే ప్రామాణికం!
- న్యూజెర్సీలో కాల్పులు..ఆరుగురి మృతి
- ఏపీ సచివాలయం వద్ద డ్రోన్ కలకలం..
- బస్సులో వెళ్తున్న యువతికి తాళి కట్టిన యువకుడు
- 8 మంది.. 8 గంటలు
- నాకు బైక్.. జడ్జికి రూ. 15 లక్షలు
- నాడు గొంతు కోశాడు నేడు ప్రాణం తీసుకున్నాడు
- ఖాకీల నిర్లక్ష్యం.. ఈ శవమే సాక్ష్యం!
- సినిమా పేరు మార్చాం
- ఆనమ్ మీర్జా మెహందీ వేడుకలో సానియా తళుకులు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
